ఒక కప్పు రైస్, ఒక అరటిపండు, ఒక గ్లాస్ పాలు, 4 ఎండు ఖర్జురాలు - రాత్రి పూట అన్నింటికంటే ఉత్తమమైన ఆహారం ఇదే

Loading...
రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న డైలమాలో ఉన్నారా ? ఏం తింటే ఏమవుతుందో అని కంగారు పడుతున్నారా ? కొందరు రైస్ తినకూడదు అంటారు, మరికొందరు పెరుగు తినకూడదు అంటారు. కొంతమంది ఫ్రూట్స్ తినాలి అని చెప్తే.. మరికొంతమంది నాన్ వెజ్ తినకూడదని సూచిస్తారు. అసలు రాత్రిపూట ఏం తినాలి ?
పడుకునే ముందు ఆహారం ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. తేలికైన ఆహారం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అలాగే.. కంటినిండా నిద్ర పడుతుంది. పడుకోవడానికి ముందు ఎలాంటి ఆహారం హెల్తీగా ఉంటుంది అనేదానిపై స్టడీస్ జరిగాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు పడుకోవడానికి ముందు తీసుకుంటే.. మంచిదని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంతకీ ఆ ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ ఏంటో చూసేద్దామా…
కప్పు రైస్ :
రాత్రిపూట భోజనంలో ఒక కప్పు రైస్ మాత్రమే ఏదైనా కూరతో తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. ఇది నిద్రలేమి సమస్య రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే కంటినిండా నిద్రపట్టేలా చూస్తుందట.
అరటిపండు :
అరటిపండులో విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషికి సుఖవంతమైన నిద్ర అందించడానికి సహాయపడతాయి. మెగ్నీషియం పెరిగి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి సహాయపడుతుంది.
పాలు :
ఒక గ్లాసు పాలు రాత్రిపూట తాగడం వల్ల.. మీ నరాలు రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.
ఎండు కర్జూరాలు :
జీర్ణక్రియ సమస్యలను తగ్గించే పదార్థాలు ఎండు కర్జూరాల్లో దాగున్నాయి. రోజూ 4 ఎండు కర్జూరాలు తినవచ్చు. దీనివల్ల నిద్ర కూడా హ్యాపీగా పడుతుంది.
Loading...

Popular Posts