బరువు తగ్గించుకోవాలనే వాళ్ల కోసం రెండు రకాల టొమాటో సూప్‌లు.. 45 రోజుల్లో ఆరోగ్యంగా బరువు తగ్గుతారు

Loading...
బరువు తగ్గించుకోవాలనే వాళ్ల కోసం రెండు రకాల టొమాటో సూప్‌లు ఇవి.
సూప్ - 1
కావలసినవి:

 • బంగాళాదుంప, క్యారెట్‌, ఉల్లిపాయ - ఒక్కోటి చొప్పున, 
 • టొమాటో తరుగు - ఒక కప్పు, 
 • నీళ్లు - ఒక గ్లాస్ (250ml ), 
 • వెజిటబుల్‌ స్టాక్‌ (కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు) - ఒక గ్లాస్ (250 ml ), 
 • టొమాటో గుజ్జు - ఒక టేబుల్‌ స్పూన్‌, 
 • కారం - అరటీస్పూన్‌, 
 • ఉప్పు - రుచికి సరిపడా.

తయారీ:
ఉల్లి, క్యారెట్‌, బంగాళా దుంప ముక్కల్ని సాస్‌ పాన్‌లో వేసి నీళ్లు, కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి కలపాలి. సాస్‌పాన్‌ను స్టవ్‌ మీద పెట్టి మంట పెద్దదిగా పెట్టి ముక్కల్ని ఉడికించాలి. తరువాత టొమాటో ముక్కలు, టొమాటో గుజ్జు, ఉప్పు, కారం వేసి 25 నిమిషాలు సన్నటి మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో గరిటెతో మిశ్రమాన్ని కలుపుతుండాలి. అవసరమనుకుంటే మధ్యలో నీళ్లు కలపొచ్చు. అన్నీ ఉడికాక స్టవ్‌ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి మెత్తటి సాసీ సూప్‌లా గ్రైండ్‌ చేయాలి. సూప్‌ బౌల్‌లో వేడివేడి సూప్‌ వేసుకుని తాగితే హాయిగా ఉంటుంది.
సూప్ - 2
కావలసినవి: 

 • బంగాళాదుంప - ఒకటి (పెద్దది), 
 • పచ్చి టొమాటోలు - ఏడు, 
 • ఉల్లిపాయ - ఒకటి, 
 • వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, 
 • అల్లం - చిన్న ముక్క, 
 • టొమాటో గుజ్జు - రెండు టేబుల్‌ స్పూన్లు, 
 • ఆలివ్‌ నూనె - అర టేబుల్‌ స్పూన్‌, 
 • తాజా తులసాకులు (తరిగి) - ఒక కట్ట, 
 • ఉప్పు, మిరియాలు - రుచికి సరిపడా, 
 • ఎండుమిర్చి తునకలు - అర టీస్పూన్‌.

తయారీ:
ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి, బంగాళాదుంపలను సన్నగా తరగాలి. మీడియం సైజ్‌ సాస్‌పాన్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనె వేసి ఉల్లి, వెల్లుల్లి ముక్కల్ని మెత్తగా అయ్యేవరకు వేగించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి మరో నిమిషం వేగించి అరలీటరు నీళ్లు పోయాలి.
బంగాళాదుంప ముక్కలు కాస్త మెత్తబడ్డాక స్టవ్‌ మంటను తగ్గించి ముక్కలు బాగా మెత్తబడేవరకు ఉడికించాలి. తరువాత అందులోనే తులసాకుల తరుగు, ఉప్పు, మిరియాలు వేసి కాసేపు ఉంచి స్టవ్‌ ఆపేయాలి. ఈ సూప్‌ను వేడివేడిగా బ్రెడ్‌ స్టిక్స్‌తో కలిపి తాగితే రుచిగా ఉంటుంది. 

ఈ రెండు రకాల సూప్ లో ఏది నచ్చితే అది తాగండి. 
రోజుకి ఒక సారి సాయంత్రం పూట కానీ రాత్రి పడుకునే ఒక గంట ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. 45 రోజుల్లో ఆరోగ్యంగా బరువు తగ్గుతారు
Loading...

Popular Posts