ఇదిగానీ మీ వల్ల అయితే వారానికి 3 కిలోలు బరువు తగ్గుతారు

Loading...
ప్రస్తుతం సమాజంలో ఎంతోమందిని శనిలా పట్టి పీడుస్తున్న సమస్య ఊబకాయం. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ఊబకాయుల శాతం ఆందోళనను కలిగిస్తోంది. అధిక బరువును తగ్గించుకోవడానికి జనం నానా పాట్లు పడుతున్నారు. ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదని కొందరు బాధపడుతుంటే... ఎంత ఖర్చయినా ఫర్వాలేదని కొందరు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో ఉంటూ ఈ టిప్స్ ఫాలో అయితే వారానికి మూడు కిలోల బరువు తగ్గొచ్చని డైటీషియన్స్ అభిప్రాయపడుతున్నారు. కచ్చితంగా సత్ఫలితాలు వస్తాయని నమ్మకంగా చెబుతున్నారు.
బరువు తగ్గడానికి వీక్లీ డైట్ ప్లాన్:
  • 1. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకుని తాగండి.
  • 2. బ్రేక్‌ఫాస్ట్‌ పేరుతో దోశలు, పూరీలు తినకండి. ఒక కప్పు ఓట్‌మీల్స్ తినండి. ఆ తరువాత ఆరెంజ్ జ్యూస్ కానీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ కానీ తాగండి.
  • 3. లంచ్ సమయంలో తగిన మోతాదులో ఆహారం తీసుకోండి. పెరుగన్నం కానీ, చపాతీ గానీ తినడం మేలు. గ్లాస్ మజ్జిగ తాగండి. మితంగా భుజించండి.
  • 4. సాయంత్రం స్నాక్స్‌గా ఫైబర్ బిస్కెట్స్ తీసుకోవడం మంచిది. ఆ తర్వాత గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ తాగండి.
  • 5. డిన్నర్‌లో పెసరపప్పు కిచిడి పెరుగుతో కలిపి తినండి లేదా బ్రౌన్ రైస్ తినండి. అవి అందుబాటులో లేకపోతే పప్పుతో చపాతీలు తినండి. ఆ తర్వాత గ్లాస్ కంటే ఎక్కువ నీరు తాగకండి.
  • 6. వీలైనంత వరకూ మీ ఆహార మెనూలో సలాడ్స్, సూప్స్, నట్స్ ఉండేలా చూసుకోండి.
  • 7. రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగండి.
  • 8. జంక్ ఫుడ్, ఆయిల్, సాల్ట్, స్వీట్స్, బ్రెడ్‌ సంబంధిత ఆహార పదార్థాలను వీలైనంత దూరంగా ఉంచండి.
  • 9. మగాళ్లు సిగరెట్స్, ఆల్కహాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
  • ఈ డైట్‌ను పక్కాగా ఫాలో అయితే బరువు తగ్గడం ఖాయమని డైటీషియన్స్ చెబుతున్నారు. ట్రై చేసి చూడండి మరి.
Loading...

Popular Posts