ఈ జ్యూస్ తాగుతూ ఉంటే 15 రోజుల్లోనే ముఖంలో రంగు మారడం స్ఫష్టంగా తెలుస్తుంది

Loading...
కావాల్సిన పదార్థాలు:
అరకప్పు టమాటా రసం, 
పావుకప్పు క్యారెట్ రసం, 
పావు కప్పు బీట్ రూట్ రసం, 
పావు చెంచా మిరియాల పొడి,
అరచెంచా అల్లం రసం, 
అరచెంచా నిమ్మరసం, 
ఒక చెంచా తేనె.
తయారీ విధానం:
  • ముందుగా టమాటా, క్యారెట్, బీట్ రూట్ లను కొంచెం ఉప్పు కలిపిన వేడి నీటిలో కడిగి శుభ్రం చేయాలి.
  • తర్వాత వాటిని ముక్కలుగా కోసి మెత్తగా దంచి ఆ ముద్దను పలుచని నూలు బట్టలో వేసి రసమంతా ఓ గిన్నెలో పిండుకోవాలి. 
  • గుడ్డలో మిగిలిన పిప్పిని పారవేయకుండా ఓ పక్కన భద్రపర్చుకోవాలి. (దీని ఉపయోగం కింద ఉంటుంది).
  • తయారైన రసంలో దంచి వడపోసి తీసుకున్న అల్లం రసం, గింజలు లేకుండా పిండిన నిమ్మరసం, మిరియాల పొడి, తేనె కలిపి పానీయం సిద్ధం చేసుకోవాలి.
  • నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యూస్ లో కలపొద్దు.
  • వాడే విధానం:
  • ఈ జ్యూస్ లోని పదార్థాలన్నీ కలిసిపోయేట్టు బాగా తిప్పి ఉదయం బ్రష్ చేసుకున్నాక ఓసారి, సాయంత్రం మరోసారి తాగాలి. ఇక జ్యూస్ తీయగా మిగిలిపోయిన క్యారెట్, టమాట, బీట్ రూట్ పిప్పిలో కొంచెం పాలమీది మీగడ కలిపి అతి మెత్తని గుజ్జులాగా నూరి ఆ మిశ్రమాన్ని నిదానంగా ముఖమంతా దట్టంగా లేపనం చేసుకోవాలి. ఒక గంట ఆగి గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.
ప్రయోజనాలు:
పైన చెప్పిన విధంగా రెండు పూటలా ఈ పానీయాన్ని సేవిస్తూ లేపనాన్ని ముఖానికి రాస్తుంటే 15 రోజుల్లోనే ముఖంలో రంగు మారడం స్ఫష్టంగా తెలుస్తుంది. చర్మం మృదువుగా కోమలంగా అవుతుంది. అయితే ఏడు రోజుల్లోనే ఎర్రగా మంచి మార్పును గమనించిన మీరు ఈ ప్రాసెస్ ని ఆపకుండా 40 రోజుల పాటు కొనసాగిస్తే అపురూపమైన సౌందర్య శోభ మీ సొంతమవుతుంది.
Loading...

Popular Posts