ఒక అరటిపండు 150 గ్రాముల మటన్, అర లీటర్ ఆవు పాలతో సమానం.. కేవలం పండుగానే కాకుండా ఆహారంగా తీసుకోవచ్చు

అరటి ఒక చెట్టులా కనిపించినా నిజానికి ఇది ఒక మూలిక. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థ శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావడంతో దీన్ని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం తీసుకోవచ్చు. 150 గ్రాముల మేక మాంసంలోను, సగానికి కోసిన కోడి గుడ్డులోను, 400 గ్రాముల ఆవుపాలలోను ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం ఒక మోస్తారు పొడవున్న అరటి పండులో ఉంటుంది. పెరిగే పిల్లలకు , వృద్ధులకు వ్యాధుల నుంచి కోలుకునే వారికి ఇది సరైన ఆహారం. అరటి పండు పైనుండే దళసరి తోలు సూక్ష్మక్రిములను, విష పదార్ధాలను అడ్డుకొంటూ, రక్షక కవచంగా పనిచేస్తుంది. మధుమేహ రోగులు ఇతర పిండి పదార్ధాలను తగ్గించుకోగలిగితే, అరటి పండును తినడంలో అభ్యంతరం లేదు.

అరటి పండులో సుమారు 100 కేలరీల శక్తి విడుదలవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్న వారికి శారీరకావసరాలకు, రోజుకు సుమారు 1600 కేలరీల శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకొని అరటిని తినవచ్చు. అరటిలో కొవ్వు పదార్థాం చాలా అల్పమోతాదులో ఉంటుంది. ఈ కారణంతో దీన్ని కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీనిలో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ కాబట్టి దీన్ని కిడ్నీ ఫెయిల్యూర్‌లో వాడకూడదు. దీనిలోని పొటాషియం బీపీ, ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మల బద్ధకాన్ని, అల్సర్లను అరికడతాయి. డయేరియాను తగ్గించడంలో అరటి ఎంతో ఉపయోగపడుతుంది.

Popular Posts

Latest Posts