మెంతులతో తయారుచేసుకునే ఈ పేస్ట్ తో 100% చుండ్రు, జుట్టు రాలిపోయే సమస్యలను అరికడుతుంది

Loading...
వెంట్రుకలు రాలిపోవడమనే సమస్యను నేటి తరుణంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. కారణాలేమున్నా గాని వెంట్రుకలు రాలిపోవడమనేది ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది. దీనికి తోడు చుండ్రు, నల్ల జుట్టు తెల్లబడడం వంటి ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో శిరోజాలను సంరక్షించుకోవడం కష్టతరమవుతుంది. అయితే ఇందుకు మెంతులు మనకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. మెంతులతో తయారు చేసిన పేస్ట్ వాడడం వలన పైన చెప్పిన సమస్యలన్నింటినీ తొలగించుకోవచ్చు.
  • కొన్ని మెంతులను తీసుకొని వేడి కొబ్బరి నూనెలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నేఆ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. అనంతరం 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. దీంతో జుట్టు సంబంద సమస్యలన్నీ తొలగిపోతాయి. శిరోజాలు కాంతివంతమవుతాయి.
  • కొబ్బరి నూనెకు బదులుగా పెరుగును వాడినా మంచి ఫలితం ఉంటుంది. దీంతో చుండ్రు సమస్య త్వరగా తగ్గిపోతుంది. 
  • అలాగే మెంతులను మందార పూలతో కలిపి మెత్తని పేస్ట్ చేసి జుట్టుకు పట్టించాలి. అరగంట అయ్యాక స్నానం చేసేయాలి. దీంతో జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. ఇతర జుట్టు సమస్యలు కూడా పోతాయి.
Loading...

Popular Posts