గడ్డం పెంచుకుని ఆరోగ్యంగా ఉండండి అవును ఇది నిజం గడ్డంతో ఉన్నవారి ఆరోగ్యం చాల మెరుగ్గా ఉంటుంది

Loading...
నిజానికి మనం ఉంటున్న సమాజంలో గడ్డం పెంచామంటే వాడి జీవితంలో ఏదో పొగొట్టుకున్నాడని, లవ్ ఫెయిల్యూర్ అని అంటారు. కాని ప్రస్తుత ట్రెండ్
మాత్రం అలా కాదు గడ్డం పెంచినోడే ట్రెండ్. ముఖానికి నప్పేటట్టుగా దానిని కట్ చేసుకుంటే... ఆ ముఖానికి వచ్చే లుక్కే వేరు... ఈ మధ్య ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు తెలుగు, హిందీ హీరోలు. ఇప్పటి వరకు పురాణాల్లో గురువులు అంతా గడ్డంతో ఉన్నవాళ్లే... గడ్డం ఉంటే తెలివిగలవారన్న అర్ధం వచ్చేలా తయారైంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే.. నీట్ గా షేవ్ చేసుకుని... పౌడర్ వేసుకుని స్కిన్ టోన్ వైట్ గా వెళ్లేవారికన్న... రింగులు తిరిగిన గడ్డంతో ఉన్నవారి ఆరోగ్యం చాల మెరుగ్గా ఉంటుందంటా.... వీరికి చర్మసంబంధ, శ్వాస సంబంధ వ్యాధులు తక్కువ... ఈ విషయం ఓ పరిశోధనలో వెల్లడైంది. గడ్డం లేనివారి కన్న గడ్డం ఉన్నవారి ఆరోగ్యం మూడు రేట్లు మెరుగ్గా ఉంటుంది. గడ్డం పెంచుకునే వాళ్లకు అంటు వ్యాధులు సోకే ప్రమాదం చాల తక్కువ. ఎందుకంటే చర్మానికి బాక్టీరియా సోకే ప్రమాదం కూడ తక్కువగా ఉంటుందని ఒక రీసెర్చ్ లో తెలిసింది. సాఫ్టీలోకొక్కస్ అనే బాక్టీరియా గడ్డం గీసుకునే వారి చర్మంపై పేరుకు పోయి అలర్జీ లాంటివి వస్తాయి. అంతేకాకుండా గడ్డం గీసుకోవటం వల్ల చర్మంపై గాట్లు పడుతాయి... దీనివల్ల చర్మంపై గాయాలై బాక్టీరియా చేరే ప్రమాదం ఎక్కువ.
Loading...

Popular Posts