క‌ర్పూరంతో హార‌తి ఇవ్వడం వెనక సైన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వ‌ల్ల వ‌చ్చే పొగ‌తో ఎన్నో రోగాలు దూరమవుతాయి

హిందూ సాంప్ర‌దాయంలో అనేక ఆచార వ్య‌వ‌హారాలు అమ‌లులో ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. పురాత‌న కాలం నుంచి హిందువులు వాటిని పాటిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌ధానంగా దేవుళ్ల‌కు పూజ చేసే విష‌యానికి వ‌స్తే దీపం, అగ‌ర్‌బ‌త్తి వెలిగించడం, క‌ర్పూరంతో హార‌తి ఇవ్వ‌డం మామూలే. అయితే ఇలా చేసే ప్ర‌తి ప‌ని వెనుక సైంటిఫిక్ కార‌ణాలే దాగున్నాయ‌ని గ‌తంలో కూడా మ‌నం చూశాం. వాటి గురించి తెలుసుకున్నాం. మ‌రి క‌ర్పూర హార‌తి ఇవ్వ‌డంలో ఎలాంటి సైంటిఫిక్ కార‌ణాలు ఉన్నాయి..? దాంతో మ‌న‌కు ఏ లాభ‌మైనా క‌లుగుతుందా..? క‌లిగితే అది ఏమిటి..? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
సినామోమ‌మ్ కంఫోరా అనే వృక్షం నుంచి తీసే ప‌దార్థంతో క‌ర్పూరం త‌యారు చేస్తారు. దీన్ని హిందువులు ఎక్కువ‌గా పూజ‌ల్లో ఉప‌యోగిస్తారు. ఆ స‌మ‌యంలో హార‌తిలా క‌ర్పూరాన్ని వెలిగించి దాంతో దేవుడికి హార‌తి ఇస్తారు. ఆ స‌మయంలో పొగ కూడా ఎక్కువే వ‌స్తుంది. అయితే అలా వ‌చ్చే పొగ‌ను పీల్చ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

  • క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వ‌ల్ల వ‌చ్చే పొగ‌తో ఆస్త‌మా, టైఫాయిడ్‌, త‌ట్టు, ఆందోళ‌న‌, త‌త్త‌ర‌పాటు, హిస్టీరియా, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.
  • ఆ పొగ వ‌ల్ల చుట్టూ వాతావ‌ర‌ణంలో ఉండే బాక్టీరియా, క్రిములు, వైర‌స్‌లు నాశ‌న‌మ‌వుతాయి.
  • జ్ఞాప‌క‌శ‌క్తి వృద్ధి చెందుతుంది. 
  • చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.
  • క‌ర్పూరం వాసన కొంద‌రికి ప‌డ‌దు. కానీ క‌ర్పూరం వాస‌న‌ను స్వ‌ర్గానికి చెందిన‌దిగా అభివ‌ర్ణిస్తారు. 
  • క‌ర్పూరం మండిస్తే ఎలాంటి బూడిద రాకుండా పూర్తిగా మండిపోతుంది. అందుకే దీన్ని దేవుళ్ల‌కు పూజ‌లు చేయ‌డంలో వినియోగిస్తారు.
  • క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వ‌ల్ల దాని చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణంలో పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఈ క్ర‌మంలో ఆ ఎన‌ర్జీ అంతా మ‌న‌లోకి వెళ్లి మ‌న‌కు అంతా మంచే జ‌రుగుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)