కుజ దోషం అందరూ భయపడే అంత భయంకరమైనది కాదు - కుజ దోషం మీద ఉన్న అపోహలు వాస్తవాలు

Loading...
వివాహం చేసేటప్పుడు పెద్దలు వధూవరులిద్దరి జాతకాలను చూసి ఆ తర్వాతే వారిద్దరికీ వివాహం చేయటం పరిపాటి. పెద్దలు పరిశీలించే అంశాలలో కుజ దోషం ప్రధానమైనది. ఈ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహల గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం. ఏ మనిషికి అయినా సరే జన్మ లగ్నం నుండి 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉన్నా, ఆ స్థానాలకు కుజ దృష్టి తగిలిన, అది స్త్రీల భర్త్రు భావానికి, పురుషుల కళత్ర భావానికి హాని కలిగిస్తుందని - అలాంటి జాతకులకు వివాహం చేయరాదని పెద్దలు ఆదేశం.

కుజ దోషం అందరూ భయపడే అంత భయంకరమైనది కాదు. వధూవరుల ఇద్దరి జాతకాలలో కుజ దోషం సమానంగా ఉంటే వివాహం చేయవచ్చని శాస్త్రం చెప్పుతుంది. అలాగే మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనా రాసులు సప్తమంలో ఉండి - ఆ రాశులలో కుజుడు ఉంటే శుభమే చేస్తాడు. కాబట్టి కుజ దోషం గురించి ఎక్కువగా అపోహ పడకుండా మిగతా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోని వివాహాలు చేయాలి.
Loading...

Popular Posts