ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంట్లో డబ్బు లేదన్న సమస్య వినిపించదు

Loading...
ప్రతిఒక్కరూ.. తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనుగడ సాగించడానికి చాలా ముఖ్యమైనది. ఆహారంతోపాటు, డబ్బు కూడా చాలా అవసరమైనది. అయితే కష్టపడి పనిచేసినప్పుడు కావాల్సినంత డబ్బు పొందగలుగుతాం. కొన్ని సార్లు.. అంతా బాగానే జరుగుతూ ఉంటుంది. మనకు అనుకూలంగా అన్నీ సాగుతుంటాయి. అయినా కూడా.. మన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. ఎప్పుడూ.. డబ్బు కొరతగా, లేమి అనే ఆందోళన ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మీరు ఫేస్ చేస్తుంటే.. వెంటనే.. అలర్ట్ అవ్వాలి. మీ కష్టార్జితం కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడకపోతే.. తర్వాత మరింత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో కొన్ని నియమాలు పాటించడం, కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అవడం, కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల.. మీరు సంపాదించిన ధనం మీ దగ్గరే ఉంటుంది. డబ్బు లేదు అన్న సమస్య దగ్గరకు రాకుండా ఉంటుంది. మరి అందుకోసం ఏం చేయాలో చూద్దాం..
ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు. అలాగే.. మీ ఇంట్లో డబ్బు లేదన్న సమస్య మరోసారి వినిపించదు.
 • పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంను ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటే.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
 • మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మీ, కుబేరులు లేదా స్వస్థిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల.. మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా..స్థిరంగా ఉంటుంది.
 • వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి.. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు.
 • మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి. ఇది కూజా ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది సహాయపడుతుంది.
 • కూజా లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు.. అందులో కంపల్సరీ నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్లీ నీళ్లు పట్టాలి. అలాగే.. కూజా లేదా కుండను తెరచి ఉంచకండి.. మూతపెట్టుకోవాలి.
 • మెటల్ ఫిఫ్ లేదా తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబం హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.
 • సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. ఇంట్లో వాళ్లందరూ.. కలకాలం హ్యాపీగా ఉంటారు. ఇంట్లో వాళ్లందరి ఆదాయం.. పెరుగుతుంది.
 • మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే.. క్యాష్ లాకర్ ఉత్తరంవైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి.. మంచి లాభాలు పొందుతారు.
 • షాపులో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల.. ఎనర్జీని ఇచ్చి.. డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది. అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్స్ పెట్టుకోకూడదు.
 • మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే.. ఈశాన్య మూలలు అందంగా ఉండాలి. గోడలు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. చీలిపోకుండా, అందంగా ఉంటే.. పాజిటివ్ ఎనర్జీ పెరిగి.. మంచి లాభాలు పొందుతారు.
 • చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ( స్టెయిర్ కేస్ ) ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు. దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది.
 • మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ని ఎట్టిపరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.
 • మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు. రాత్రిపూట కూడా.. ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉండే ఇట్లు.. పేదరికం, డిప్రెషన్ కి సంకేతం.
 • వాస్తు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే.. సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని, చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని, ఎర్త్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ ఎనర్జీని, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను. . గ్రహించే శక్తి వాస్తుకే ఉంది.
 • ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే.. కుటుంబ సభ్యులు.. అనారోగ్యంపాలవడం, తరచుగా గొడవ పడటం, కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతాయి.
 • లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే.. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ.. డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.
Loading...

Popular Posts