సాదారణంగా మనం హనుమంతుడిని మంగళవారం పూజిస్తాం అయితే ఆంజనేయ స్వామిని ఆదివారం రోజున పూజిస్తే అష్టైస్వర్యాలు, సకల సంపదలు లభిస్తాయి

Loading...
మనం సాదారణంగా ప్రతీ రోజు ఏదో ఒక దేవుడిని కొలుస్తుంటాం. ఉదాహరణకు శనివారం వెంకటేశ్వరస్వామి, గురువారం సాయి బాబా, సోమవారం శివుడిని, బుధవారం అయ్యప్ప స్వామిని కొలుస్తుంటాం. మంగళవారం అయితే ఆంజనేయ స్వామిని పూజిస్తాము.
అయితే ఆంజనేయ స్వామిని మంగళవారం కాకుండా ప్రతీ ఆదివారం రోజున హనుమంతుని ప్రార్దిస్తే సకల సంపదలు చేకూరుతాయని...  రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరం తో అర్చించడం ద్వారా అష్టైస్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. సాదారణంగా మనం హనుమంతుడిని మంగళవారం పూజిస్తాం. కాని మంగళవారం తో పాటు ఆదివారం కూడా పూజిస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి.
ప్రతీ ఆదివారం రోజున ఆంజనేయ స్వామీ ఆలయాన్ని సందర్శించడం వలన అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య పూట ఆంజనేయ స్వామికి నేతితో దీపమేలిగించి, హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకల సంపదలు ఉన్నత పదవులు లభిస్తాయని నమ్మకం.

"అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యం తవకిన్ వధ
రామదూత కృపా సింధో
మత్ కార్యం సాధ్య ప్రభో"
ఈ మంత్రాన్ని ఆదివారం 9 సార్లు పఠించిన వారికి ఈతిభాదలు, గ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
Loading...

Popular Posts