పొట్ట దగ్గర కొవ్వు లేకుండా పొట్ట మంచి షేపులో ఉండాలంటే ?

పొట్ట దగ్గర కొవ్వు ఉంటే చూసేవాళ్ళకి లేని ఇబ్బంది కూడా మనకే ఉంటుంది. చూడ్డానికి ఎలా ఉన్నాం అనేదాన్ని పక్కనపెడితే, పొట్ట దగ్గర కొవ్వు ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు ఇలా చెప్పుకుంటేపోతే పదుల సంఖ్యలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. పొట్ట మంచి షేపులో ఉండాలంటే కేవలం వ్యాయామాలు చేస్తే సరిపోదు. మంచి ఆహారం కూడా తీసుకోవాలి.
రోజుకి కనీసం వంద కెలరీలు ప్రొటీన్ల ద్వారా బాడిలోకి చేరాలి. చికెన్, గుడ్లు, పాలు, మీగడ తీసిన పెరుగు మంచి మోతాదులో పోషకాలను అందిస్తాయి. కొవ్వు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండే ఆహారం మీద మనసుపెట్టాలి.
కొవ్వు అదుపులో ఉండాలంటే రోజుకి కనీసం పదిగ్రాముల ఫైబర్ శరీరంలో చేరాలి. ఇందుకోసం యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంప, కాయగూరలు, అటుకులు, పొట్టు తీయని తృణధాన్యాలు, బీన్స్, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే పీచు పదార్థాలు వలన గ్యాస్ ఏర్పడుతుంది. కాబట్టి నీళ్ళు బాగా తాగాలి. కనీసం 8-10 గ్లాసుల నీళ్ళు రోజు తాగాలి.

ఇలా మంచి ఆహార అలవాట్లతో పాటు, క్రమం తప్పని వ్యాయామం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే పొట్ట సరైన షేపులో ఉంటుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)