ముఖం నిగనిగలాడుతూ ముఖానికి మంచి కలర్ తెచ్చే ఫ్రూట్స్ ఇవి

Loading...
ముఖం రంగు తేలడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. కాని ముఖం మెరిసిపోవాలని మార్కేట్లో దొరికే రకరకాల కెమికల్స్, ఫేస్ క్రీమ్స్ వాడే ఎక్కడలేని ప్రమాదాలు కొనితెచ్చుకుంటూ ఉంటారు. అన్నిరకాల క్రీమ్స్ హానికరం అని అనలేం కాని, సహజమైన ఫలాలతో ఫలితాలు పొందే వీలుంటే, ఖర్చు పెట్టడం ఎందుకు. ఆ ఫలాలేంటి అంటే ...
  • అరటిపండ్లలో పొటాషియం బాగా దొరుకుతుంది. ఇది చర్మాన్ని మాశ్చరైజింగ్ గా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానికి చవకగా దొరికే ఔషధం లాంటిది అరటిపండు.
  • టొమాటోలు మొటిమలతో ఇబ్బందిపడేవారికి మేలు చేస్తాయి. అలాగే మృదువైన చర్మం కావలంటే టొమాటో తినడమే కాదు, ముఖానికి పడుతూ ఉండాలి. 
  • ఆపిల్ పండులో మాలిక్ ఆసిడ్ దండిగా దొరుకుతుంది. ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మానికి ఇది ఎంతో అవసరం.
  • బొప్పాయి లో ఉండే ఎంజీమ్స్, యాంటిబ్యాక్టిరియల్ లక్షణాలు చర్మంలో పేరుకుపోయిన మురికిని బయటకి లాగి, చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.
  • మొటిమలకు, మురికి, దుమ్ముధూళికి అతిపెద్ద శతృవు నిమ్మ. ఇది శక్తివంతమైన ఎంజీమ్స్ కలిగి ఉంటుంది. నిమ్మ ముఖం రంగు తేలేలా చేస్తుంది. 
  • కాంతివంతమైన చర్మానికి అవకాడో వాడకం మంచి మార్గం. ఎందుకంటే ఇందులో విటమిన్ బి7 దొరుకుతుంది.
  • పైనాపిల్ లో బ్రొమ్లైన్ అనే యాంటి ఇంఫ్లేమెంటరి ఎంజీమ్ ఉంటుంది. ఇది చర్మం యొక్క రంగు పెరగటానికి సహాయపడుతుంది. అందుకే ఫేస్ ప్యాక్స్ లో పైనాపిల్ వాడుతారు.
Loading...

Popular Posts