చనిపోయిన బిచ్చగాడు ఇంట్లో కోట్ల డబ్బుని చూసి షాక్..!

Loading...
బిచ్చగాళ్లలో ధనవంతులు కూడా ఉంటారా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. ఇది నిజం. విస్మయం రేకెత్తించే ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా భిచ్చగాళ్లంటే.. గుడి ద‌గ్గ‌ర‌, ట్రాఫిక్ జంక్ష‌న్‌ల వ‌ద్ద అడుక్కుంటూ ఉంటారు. వాళ్ల‌ను చూసిన వారు అయ్యో పాపం అంటూ ఎంతో కొంత ఇస్తారు. అయితే బిచ్చగాళ్ల దగ్గర ఎంత డబ్బు ఉంటుందో తెలిస్తే... నోరెళ్ల బెట్టాల్సిందే.
కానీ ఓ బిచ్చగాడి దగ్గర వందలు, వేలు కాదు, లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలు ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే అతడు ఒక కోటీశ్వరుడు. కోట్లకు అధిపతి అయినా బతికినంత కాలం అడుక్కునే వాడిలానే బతికాడు. మరణించేటప్పుడు అనాథలానే చనిపోయాడు. ముంబాయి మహానగరంలో దిమ్మ తిరిగిపోయే బిచ్చగాడి విచిత్ర గాథ ఇది. ముంబాయి మురికివాడల్లో నివాసముంటున్న ఓ బిచ్చగాడు దొరికింది తింటూ... బిచ్చంగా అడుకున్న డబ్బుని గుడిసెలో ఓ పక్కన పెట్టేవాడు. వృద్ధాప్యంతో ఇటీవలే మరణించాడు.
కానీ అతనికి ఓ స్వచ్చంధ సేవా సంస్థ ప్రతినిధులు అంత్యక్రియలను జరిపించారు. అనంతరం అతనుండే గుడిసెను వెతికితే కళ్లు బైర్లు కమ్మే విధంగా నోట్లు బయటపడ్డాయి. చిల్లర.., నోట్లు అన్నీ కలిపితే రూ.కోటి 86 లక్షల 43 వేలు బయటపడ్డాయి. అంటే ఆ బిచ్చగాడు అచ్చంగా కోటీశ్వరుడు అన్నమాట. మొత్తానికి అంత డబ్బు గుడిసెలో పెట్టుకుని అనాథలా, అడుక్కుంటూ బతికాడు. చనిపోయాక కోటీశ్వరుడని తెలిసి జనం షాక్ అయ్యారు.
Loading...

Popular Posts