యంగ్ గా కనపడాలంటే దిక్కుమాలిన కెమికల్స్ తో తయారుచేసిన క్రీమ్స్ వాడకుండా ఈ ఆహారపదార్దాలను తినకుండా ఉంటె చాలు

Loading...
ప్రస్తుత వాతావరణ కాలుష్యం, తీసుకుంటున్న ఆహారం ఫలితంగా చాలామంది వయసుకు మించి కనిపిస్తుంటారు. అలాంటి వారికి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తుంటాయి. దీనికి మనం తీసుకుంటున్న ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుందని వైద్యులు అంటున్నారు. అలాంటి ఆహారాలు త్వరగా వృద్ధాప్యాన్ని తెచ్చిపెడతాయి. అందుకే వాటిని వీలైనంత వరకు తీసుకోకుండా ఉండటమే మంచిదని, లేదంటే పూర్తిగా మానేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు... అయితే మనం తినకూడని ఆహారం ఏమిటంటే...
  • స్వీట్లు చాలా మందికి ఇష్టమే. కొందరైతే వీటిని ఎల్లప్పుడూ అదే పనిగా తింటుంటారు. ఇలా తినేవారి శరీరంలో గ్లెకేషన్‌ అనే ప్రక్రియ స్టార్ట్‌ అయి, అది ప్రోటీన్లను గ్రహించకుండా చేస్తుంది. దీంతో కణాలు త్వరగా బలహీన పడి వృద్ధాప్యం వస్తుంది. 
  • కాఫీలను కూడా ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే కాఫీవల్ల చర్మం పొడిబారిపోయి త్వరగా ముడతలు పడుతుంది. 
  • పిండి పదార్థాలను తక్కువగా, ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవాలి. పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కణాలు త్వరగా వృద్ధాప్య దశకు వచ్చేస్తాయి. 
  • ఉప్పును ఎక్కువగా వాడడం మానేయాలి. లేదంటే శరీరంలో సోడియం నిల్వలు బాగా పేరుకుపోయి దాహం వేస్తుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీసి చర్మం ముడతలు పడేలా చేస్తుంది. 
  • కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తిన్నా వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి. ఎందుకంటే కారంలోని పదార్థాలు మన శరీరంలోని ఎర్ర రక్త కణాలపై ప్రభావం చూపిస్తాయి. దీంతో చర్మం తన సహజ కాంతిని కోల్పోతుంది. వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. 
  • సాధారణ శరీరం ఉన్న వారి కన్నా స్థూలకాయలు త్వరగా వృద్ధాప్యం బారిన పడతారు. పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఇది వెల్లడైంది. కాబట్టి కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. దీనికి తోడు అధిక బరువును కూడా తగ్గించుకోవాలి.
Loading...

Popular Posts