రోజుకి రెండు అంజీరా పళ్ళు తింటే.. బరువు తగ్గడానికి, రక్తం బాగా పట్టడానికి, ఇలా చెప్పుకుంటే బోలెడు లాభాలు

Loading...

  • అంజీరలో పీచు అధికంగా లభిస్తుంది. పీచు అరుగుదలకు మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది. దాంతో మలబద్ధకం దూరమవుతుంది. చిన్నారులకు దీన్ని రెండుపూటలా తినిపించడం మంచిది.
  • ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో అధికరక్తపోటు సమస్య కనిపిస్తోంది. దీన్ని అదుపు చేయడానికి పొటాషియం, సోడియం దొరికే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ పోషకాలు అంజీరలో దొరుకుతాయి. అవి అధికరక్తపోటును అదుపులో ఉంచుతాయి.
  • మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు రోజూ అంజీర తీసుకోవడం మంచిది. ఇందులో హిమోగ్లోబిన్‌ స్థాయుల్ని పెంచే పోషకాలు అధికం. రక్తహీనతా దూరమవుతుంది.
  • బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఎంచుకోవడం మంచిది. కొన్ని ముక్కల్ని భోజనానికి ముందు తీసుకోవడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది. అతిగా తినే సమస్య తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ సమస్య ఉండదు.
  • హృద్రోగాలతో బాధపడేవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అంజీర చేర్చుకుంటే మేలు. ఇందులో పెక్టిన్‌ అనే పదార్థం శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది. గుండెకూ మేలుచేస్తుంది.
  • సంతానం కోరుకునేవారూ అంజీరను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీసు, జింకు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్రపోషిస్తాయి.
Loading...

Popular Posts