గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి అద్భుతమైన మార్గం.. కానీ సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకుంటేనే దాని ఫలితం కనిపిస్తుంది

  • గ్రీన్ టీ.. చాలా పాపులర్ బివరేజ్. ఇందులోని అత్యంత గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలియడం వల్ల.. అందరూ గ్రీన్ టీ తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. బరువు తగ్గాలి అనుకునేవాళ్లు, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకునేవాళ్లు, అందమైన స్కిన్ పొందాలి అనుకునేవాళ్లు, మెటబాలిజం మెరుగుపడాలి అనుకునేవాళ్లు, ఎనర్జిటిక్ గా, హెల్తీగా ఉండాలి అనుకునేవాళ్లు.. గ్రీన్ టీ తాగాలి. కానీ నీళ్లు తాగినట్టు.. ఒక కప్పు తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా తాగడం వల్ల అన్ని ప్రయోజనాలు ఒకేసారి పొందవచ్చు అనుకుంటే పొరపాటు. గ్రీన్ టీని సరైన సమయంలో తాగకపోతే.. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలర్ట్ గా ఉండాలి. గ్రీన్ టీలో కెఫీన్, టాన్నిన్స్ ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ జ్యూస్ పై ప్రభావం చూపి.. పొట్టకు సమస్య తీసుకొస్తాయి. దీనివల్ల వికారం, గ్యాస్ట్రిక్ పెయిన్, పొట్టలో ఎసిడిటీ సమస్య వస్తుంది. అందుకే గ్రీన్ టీని సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోవాలి. అప్పుడు.. అందులోని ప్రయోజనాలు పొందవచ్చు. గ్రీన్ టీలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. కానీ.. ఎక్కువగా తీసుకోవడం వల్ల.. ఆరోగ్యంపై చాలా దుష్ర్పభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. గ్రీన్ టీని ఏ సమయంలో తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
  • ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే.. శరీరాన్ని శుభ్రం చేస్తుందని నమ్ముతారు. కానీ.. అది పొరపాటు. గ్రీన్ టీలో ఉండే కెఫీన్ పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూస్ ని డైల్యూట్ చేసి.. సమస్యకు కారణమవుతుంది.
  • గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలన్నీ పొందాలంటే.. భోజనానికి అరగంట ముందు లేదా భోజనం తర్వాత 1 నుంచి 2 గంటల మధ్యలో తీసుకోవాలి.
  • గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, ధియనైన్ ఉంటాయి. ఇవి.. ఆరోగ్యానికి మంచిది. కానీ.. పాలల్లో ఉండే ప్రొటీన్స్, క్యాలరీలు, పంచరాలో ఉండే ఫ్లేవనాయిడ్స్.. నెగటివ్ రియాక్షన్ కి కారణమవుతాయి. కాబట్టి.. పంచదార, పాలు కలపకపోతే.. అందులోని ప్రయోజనాలన్నీ పొందవచ్చు.
  • గ్రీన్ టీలో ఉండే కెఫీన్, తేనెలో ఉండే విటమిన్స్.. ఫ్యాట్ కరిగించడంలో సహాయపడతాయి. తేనె క్యాలరీలు తగ్గించడానికి, గ్రీన్ మెటబాలిజం పెంచడానికి సహాయపడుతుంది.
  • గ్రీన్ టీని భోజనం చేసిన వెంటనే తీసుకోరాదు. కెఫీన్ జీర్ణక్రియపై ప్రభావం చూపి.. పోషకాలు గ్రహించకుండా అడ్డుకుంటుంది.
  • రోజుకి 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల.. ప్రయోజనాలన్నీ పొందవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిండెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరంలో టాక్సిన్స్ ని పెంచి.. కాలేయంపై దుష్ప్రభావం చూపుతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)