ఓ జర్నలిస్ట్ ఫాస్ట్ ఫుడ్డు సెంటర్ యజమాని తో ఫ్రెండ్ షిప్ చేసి బాగా ఫ్రెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏ రేంజ్ లో కల్తీ చేస్తారో అన్ని చెప్పాడు. ఆ కల్తీ వివరాలు వింటే మీ గుండె ఆగిపోతుందేమో

ప్రతీ వ్యక్తీ సాయంత్రమైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు అడుగు వేస్తుంటారు. నగరాలలోనే కాకుండా చిన్న చిన్న పట్టణాలలో, ఆఖరుకు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిసాయి. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే భయంకర ప్రభావం ఏంటో ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిన శివ మాటల్లోనే విందాం.శివ అనే వ్యక్తి ఫాస్ట్ ఫుడ్డు సెంటర్ నిర్వహించిన ఓ యజమాని. రోజుకి 2000 రూపాయలు పైగా సంపాదించేవాడు. ఓ జర్నలిస్ట్ శివ తో ఫ్రెండ్ షిప్ చేసి బాగా ఫ్రెండ్ అయిన తర్వాత తన బిజినెస్ సీక్రెట్స్ అన్ని చెప్పాడు. సీక్రెట్స్ అంటే ఏ రేంజ్ లో కల్తీ చేస్తారో అని. ఆ కల్తీ వివరాలు వింటే మీ గుండె ఆగిపోతుందేమో !!
 • ఫాస్టు ఫుడ్డు షాపులో వాడే చికెను తాజా అయినది కాదు నిన్నటిది మొన్నటిది ఒక్కోసారి ఒకవారం క్రితంవి కూడా వాడుతాము.
 • చెడిపోయిన చికెనును వెనీగరులో ముంచి వాటి వాసన కస్టమర్లకు తెలియకుండా చేస్తాము.
 • చికెను రైస్ చేసేటప్పుడు చెడిపోయి తెల్లగా మారిన చికెనుకు ఆరెంజ్ కలరును వాడి రంగును మారుస్తాము. ఆ కలరును మీ చేతిలో వేసుకుని ఒక నిమిషం తరువాత కడిగితే ఆ కలరు వారం రోజులవరకు పోదు.
 • సోయా సాస్, రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు కానీ 10 రోజుల క్రితం కాగి కాగి మరిగిన నూనెతో కలిపి వాడుతాము.
 • ఏ షాపులోనూ మంచి నూనె వాడరు. పామాయిలు తప్ప ఏదీ వాడరు
 • కళాయిలో అన్నం అంటుకుపోకుండా, ఎక్కువగా పామాయిలును వాడి, తొందరగా, లేటు లేకుండా పదార్థాన్ని కస్టమర్లకు అందిస్తాము.
 • చెపితే నమ్మరు ఆ కళాయిలను రోజుల తరబడి కడగనే కడగము నూనే జిడ్డుపోయి మళ్ళీ లేటు అయితే పక్క షాపుకు వె్ళ్ళిపోతారని.
 • అజినోమోటో అన్న పదార్థం ఎక్కువగా వాడకూడదు మేము దాన్నిచాలా ఎక్కువగా వాడుతాము. మీరు ఒక్కసారి దాన్ని మీ నాలుక మీద పెట్టుకుని చూడండి మీకే తెలుస్తుంది.
 • తెల్ల మిరియాలపొడి లో చేతికి దొరికిన పిండిని కలిపి వాడుతాము ఆ పిండిలో పురుగులు కూడా ఉంటాయి.
 • టొమాటో సాస్ ఎక్కువమోతాదులలో కొనిపారేస్తాము అందువల్ల అవి చెడిపోయినా exp.date అయిన వాటిని కూడా వాడేస్తాము.
 • చిల్లీ సాస్ వాడుతున్న బాటిలును మీ ముక్కుదగ్గర పెట్టుకుని చూడండి. ఆ వాసనకు మీకు వాంతులు రాక మానవు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)