బియ్యం కడిగిన నీళ్ళతో అనేక లాభాలు... ముఖ్యంగా బియ్యం కడిగిన నీటితో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

చాలా మంది బియ్యం కడిగిన నీళ్ళను పారబోస్తుంటారు. మరికొందరు అయితే, పశువులకు తాపిస్తుంటారు. నిజానికి ఈ బియ్యం కడిగిన నీళ్ళతో అనేక లాభాలు ఉన్నట్టు గృహవైద్యులు చెపుతున్నారు.
బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలతో పాటు... ముఖారవిందాన్ని కూడా పెంచుతుంది. అయితే, ఈ నీటిని నేరుగా ముఖాన్ని కడుక్కోవడం కంటే.. దూదిని నీటిలో ముంచి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం తాజాగా మృదువుగా మారుతుంది. 


ఈ నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా, జట్టుకు కూడా అదనపు సౌదర్యాన్ని అందిస్తాయి. మహిళలు శిరోజాల అందంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ముఖ్యంగా.. పొడవుగు, ఒత్తుగా పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇందు కోసం బ్యూటీపార్లర్ కు కూడా వెళుతుంటారు. అయితే, చైనా దేశంలోని యావో తెగ మహిళలు మాత్రం ఇలాంటి వాటికి పూర్తి విరుద్ధం. ఈ తెగ ప్రజలు తమ జీవిత కాలంలో ఒక్కటంటే ఒక్కసారి కూడా జుట్టు కత్తిరించుకోరు. అందుకే వీరి జట్టు పొడవు ఏడు నుంచి పది అడుగుల వరకు ఉంటుంది. అయితే, వీరంతా జట్టు పెరగడానికి, ఒత్తుగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? జుట్టు ఒత్తుగా పెరగడానికి బియ్యం కడిగిన నీళ్లు తలకు బాగా రాసుకుని ఒక గంట తర్వాత తలా స్నానం చేసేస్తారు. వాళ్ళ జుట్టు ఎంత పొడవో మీరూ చూడండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)