బాడి స్ప్రే వాడటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం బాడి స్ప్రే వలన కలిగే తీవ్రమైన నష్టాలు

Loading...
టీవిల్లో యాడ్స్ చూస్తుంటాం .. ఒక బాడీ స్ప్రే లేదా పెర్ఫ్యూమ్ ఇలా కొట్టుకోగానే అమ్మాయిలంతా అలా వెంటబడుతూ ఉంటారు. అది ఒక అందమైన అబద్ధం అయితే, పెర్ఫ్యూమ్స్, బాడి స్ప్రే వాడటం అనారోగ్యకరం అనేది ఒక ప్రమాదకరమైన నిజం. మీరే చూడండి పెర్ఫ్యూమ్, బాడి స్ప్రే వలన కలిగే నష్టాలేంటో.
  • డియోడ్రెంట్స్ ఎక్కువగా అండర్ ఆర్మ్స్ లో కొట్టడం చూస్తుంటాం. ఆడవారిలో ఇది వక్షోజాలకి దగ్గరి ప్రాంతం. కాబట్టి ఆ స్ప్రే బ్రెస్ట్ టిష్యూలపై ప్రభావం చూపుతుంది. ఈ రకంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.
  • బాడి స్ప్రేలో ఎక్కువగా ఎథనాల్ ఉంటుంది. ఇది చర్మాన్ని పొడిగా మార్చుతుంది.
  • పెర్ఫ్యూమ్స్ ని తయారుచేయడానికి రకరకాల కెమికల్స్ వాడతారు. వీటి తయారిలో ట్రైక్లోసన్ అనే పెస్టిసైడ్ కూడా ఉపయోగిస్తారు. ఇది ఏరకంగానూ మీ చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు.
  • ఈ బాడి స్ప్రేలలో పరాబెన్స్, పథలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిని చిన్నపిల్లలు (అమ్మాయిలు) వాడితే త్వరగా రజస్వల అయ్యే అవకాశం ఉంటుంది.
  • అలాగే గర్భిణీ స్త్రీలు పెర్ఫ్యూమ్స్ బాటిల్స్ పై మక్కువ చూపిస్తే అది బిడ్డకే ప్రమాదం. ప్రాణాపాయ స్థితి ఉన్నా లేకున్నా, బిడ్డ ఏదో ఒక లోపంతో పుట్టే ప్రమాదం ఉంటుంది.
  • మార్కెట్లో దొరుకుతున్న చాలా పెర్ఫ్యూమ్స్ లో అలుమినియం డిరైవెటివ్స్ ఉంటున్నాయి. ఈ కారణంతో మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. అయితే ఈ విషయంపై మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
  • ఇక ఈ బాడి స్ప్రేల వలన బట్టలకి మరకలు తగలడం మనందరికీ తెలిసిన విషయమే.
Loading...

Popular Posts