మీ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డిలీట్ చేసేయండి

Loading...
ప్రస్తుత కాలంలో అందరూ స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. ఆ ఫోన్ లో రకరకాల యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు. అయితే అందులో కొన్ని యాప్స్ బాగా ఉపయోగపడేవి ఉంటాయి, ఉపయోగపడనవి ఉంటాయి. కొన్ని ఉపయోగపడేవే అయినా వాటితో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ క్ర‌మంలో హ్యాక‌ర్లు కూడా ప‌లు యాప్స్‌ ను తయారు చేస్తూ అందిన కాడికి వినియోగ‌దారుల స‌మాచారాన్ని త‌స్క‌రించ‌డం మొద‌లు పెట్టారు. ఒక్కో సంద‌ర్భంలో కొంద‌రు డ‌బ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా గూగుల్ కూడా త‌న ప్లే స్టోర్‌ లో ఉన్న యాప్స్ అన్నింటినీ చెక్ చేయ‌డం లేదు. దీంతో యూజర్లు త‌మంత‌ట తామే ఏ యాప్ ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. అయితే కొన్ని యాప్స్ కూడా స‌రిగ్గా పైన చెప్పిన హ్యాకింగ్ త‌ర‌హాకు చెందిన‌వే. ఈ యాప్స్ గ‌న‌క మీ ఫోన్‌ లో ఉంటే వెంట‌నే డిలీట్ చేసేయండి. ఆ యాప్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 
యూసీ బ్రౌజర్: (UC Browser)
వేగవంత‌మైన ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ గా ఈ యాప్ ఎంతో గుర్తింపు పొందింది. ఇంటర్నెట్‌ ను వేగంగా బ్రౌజ్ చేసేందుకు ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. కాక‌పోతే అలా చేసే క్ర‌మంలో ఇంట‌ర్నెట్ స్పీడ్‌ నంతా కంప్రెస్ చేస్తుంది. దీంతో ఇత‌ర యాప్‌ ల‌కు ఆటంకం క‌లుగుతుంది. కాబ‌ట్టి ఈ యాప్‌ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.
మ్యూజిక్ ప్లేయ‌ర్: (Music Player)
ఈ యాప్ ఆండ్రాయిడ్ డివైస్‌ ల‌న్నింటిలోనూ డిఫాల్ట్‌ గా వ‌స్తోంది. దీన్ని వాడ‌డం వ‌ల్ల డివైస్ బ్యాట‌రీ ఎక్కువ‌గా ఖ‌ర్చ‌వుతుంది. అదే స‌మ‌యంలో ఇంట‌ర్నెట్‌ కు క‌నెక్ట్ అయి ఉంటే పెద్ద మొత్తంలో డేటాను వాడుతుంది. కాబ‌ట్టి ఈ యాప్‌ ను డిలీట్ చేసేయండి.
డాల్ఫిన్ బ్రౌజ‌ర్: (Dolphin Browser)
ఆండ్రాయిడ్ డివైస్‌ ల‌ను వాడుతున్న యూజ‌ర్లు ఈ యాప్‌ ను గ‌న‌క ఇన్స్టాల్ చేసుకుంటే దాంతో యూజ‌ర్ స‌మాచార‌మంతా ఆ యాప్ స‌ర్వ‌ర్ల‌లోకి చేరిపోతుంది. అంతేకాదు, యూజ‌ర్ ఇంట‌ర్నెట్‌ లో చూసే సైట్ల వివ‌రాల‌న్నీ ఆ యాప్ ఓన‌ర్ల‌కు అందుతాయి. కాబ‌ట్టి ఈ యాప్‌ అత్యంత త్వరగా డిలీట్ చేసేయండి.
క్విక్ పిక్: (QuickPic)
ఇది ఓ ఫొటో గ్యాలరీ యాప్‌. దీన్ని చీతా మొబైల్స్ సంస్థ డెవ‌ల‌ప్ చేస్తోంది. కాగా ఇటీవలి కాలంలో ఈ సంస్థ క్విక్ పిక్ యాప్ ద్వారా యూజ‌ర్ల ఫోన్ల‌లో ఉన్న స‌మాచారాన్నంతా త‌న సర్వర్లకు చేరవేస్తున్న‌ట్టు గుర్తించారు. ఈ క్ర‌మంలో ఈ యాప్‌ ను ఫోన్‌ లో ఉంచుకోవ‌డం క‌న్నా తీసేయ‌డ‌మే బెట‌ర్‌. లేదంటే మీ స‌మాచార‌మంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోతుంది.
ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్: (ES File Explorer)
ఈ యాప్ వ‌ల్ల బ్లోట్‌ వేర్‌, యాడ్‌ వేర్‌ ల రూపంలో వైర‌స్‌ లు ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోకి ప్ర‌వేశిస్తాయి. కాబ‌ట్టి ఈ యాప్ ని మీ ఫోన్‌ లో ఉంటే వెంట‌నే డిలీట్ చేసేయండి.
క్లీన్ ఇట్: (Clean It)
మీ డివైస్‌ లో పేరుకుపోయిన జంక్ ఫైల్స్‌ ను క్లీన్ చేసేందుకు దీన్ని వాడతారు. కానీ అలా క్లీన్ చేసే క్ర‌మంలో ఈ యాప్ పెద్ద ఎత్తున బ్యాట‌రీని వాడుకుంటుంది. దీంతో బ్యాట‌రీ ప‌వ‌ర్‌ లో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఈ యాప్ కూడా డిలీట్ చేసేయండి.
డ్యు బ్యాట‌రీ సేవ‌ర్ అండ్ ఫాస్ట్ ఛార్జ్: (DU Battery saver & fast charge)

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ లో ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక ప్రకటన(advertisement) వ‌స్తూ మిమ్మల్ని విసిగిస్తోందా? యాప్స్ వాటంత‌ట అవే ఇన్స్టాల్ అవుతున్నాయా? అయితే అందుకు డ్యు బ్యాట‌రీ యాపే కార‌ణం. ఆ యాప్‌ ను వెంట‌నే డిలీట్ చేస్తే పైన చెప్పిన స‌మ‌స్య పోతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...