పొద్దున్న స్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ రాత్రి పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి ఎందుకంటే ?

పొద్దున్నే స్నానం చేసి పని మీద బయలుదేరామంటే మళ్ళీ చీకటి పడితే తప్ప ఇంటికి చేరడం కష్టమైపోతుంది. అంతలా బీజీ అయిపోతున్నాం మనం. అటు వెళ్ళేటప్పుడు, ఇటు ఇంటికి వచ్చేటప్పుడు.. దారిలో ఎన్నో రకాల బ్యాక్టీరియా మన శరీరం మీద వాలిపోతూ ఉంటుంది. సిటీలో ఉంటున్నామో లేక పొల్యూషన్ లో ఉంటున్నామో అర్థమే కాదు.

ఇవన్ని పోనూ, రోజంతా పని. ఒత్తిళ్ళు.. వర్క్ టెన్షన్లు. మరి ఇంటికి చేరాక ఊరికే తినేసి పడుకుంటే సరిపోతుందా? లేదు.. మన లైఫ్ స్టయిల్ కి రాత్రిపూట కూడా స్నానం చేయడం ఎంతో అవసరం అయిపోయింది.

ఎందుకంటే రాత్రివేళ చేసే స్నానం మీ శరీరంలో ఉన్న వేడిని కిందికు తెస్తుంది. అప్పుడు సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది. రోజంతా పనిచేసి అలసిపోయిన కండరాలకు రిలాక్సేషన్ స్నానంతో దొరుకుతుంది. ఎంతో హాయిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. స్నానం వలన మీ ఊపిరితిత్తుల్లో ఉండిపోయిన ఇరిటెంట్స్ క్లియర్ అయిపోతాయి. దాంతో పడుకునేటప్పుడు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉండవు.

స్నానం చేయకుండా ఉంటే రాత్రివేళ వచ్చే చల్లగాలిని సరిగా ఆస్వాదించడం కూడా కష్టం. అలాగే మీ ఒంటికి ఉన్న మురికి అంతా మీ బెడ్ కి అంటుకుపోతుంది. రోజూ అదే బ్యాక్టీరియా మధ్యలో పడుకోవాల్సి వస్తుంది. దాంతో ఎన్నోరకాల ఇంఫెక్షన్స్ వస్తాయి. తలనొప్పి, అలసట, ఒత్తిడి .. ఇవన్ని వెళ్ళిపోవాలంటే రాత్రిపూట స్నానం చేయడం మరచిపోకూడదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)