వంట్లో ఐరన్ తగ్గిపోతే ఊరికే అలసిపోతారు కాబట్టి ఐరన్ బాగా దొరికే ఆహరం తిని ఎల్లప్పుడూ హుషారుగా ఉండాలంటే ఇవి తినండి

Loading...
ఒంట్లో రక్తం ఉత్పత్తి జరగాలంటే ఐరన్ కావాల్సిందే. శరీరంలో ఉండే ఐరన్ లో 70% మన రక్తంలోనే ఉంటుంది. కాబట్టి, ఐరన్ ఖచ్చితంగా శరీరానికి అవసరము. మరీ ముఖ్యంగా మహిళలకి. రక్తస్రావం వలన మహిళలు రక్తాన్ని కోల్పోతూ ఉంటారు. అందుకే ఐరన్ డెఫిషియన్సితో ఎక్కువగా ఆడవారే బాధపడుతారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఐరన్ బాగా దొరికే ఆహారం తినాలి. అవేంటంటే ...
  • గుమ్మడి విత్తనాలు లో ఐరన్ బాగా దొరుకుతుంది. ప్రతి 100 గ్రాముల్లో 15 మిల్లిగ్రాముల ఐరన్ దొరుకుతుంది.
  • లివర్ లో ఐరన్ శాతం ఎక్కువే. చికెన్ లివర్, బీఫ్ లివర్ తినొచ్చు. అలాగే రెడ్ మీట్ లో కూడా ఐరన్ దొరుకుతుంది.
  • బీట్ రూట్స్ లో ఐరన్ మంచి మోతాదులో లాభిస్తుంది. ఐరన్ కోసం తినాలనుకుంటే, ఇవి క్యారట్ కన్నా మెరుగైన ఆప్షన్.
  • పాలకూరలో ఐరన్ బాగా లభిస్తుంది. దీన్ని పచ్చిగా కూడా తినొచ్చు.
  • కాయధాన్యలలో కూడా ఐరన్ దండిగా లభిస్తుంది. ఇందులో ప్రొటీన్ కూడా ఉంటుంది కాబట్టి, శాఖాహారులకి ఇది మంచి ఆహారం.
  • ఫ్రూట్స్ లో అయితే  పుచ్చకాయ, స్ట్రాబెరి, ఖర్జూరం లో ఐరన్ బాగా దొరుకుతుంది.
  • సోయాబీన్ లో ఐరన్ శాతం చాలా ఎక్కువగానే దొరుకుతుంది. ప్రతి వంద గ్రాముల సోయాబీన్స్ లో ఎకంగా 15.70 గ్రాముల ఐరన్ శాతం ఉండటం విశేషం.
  • ధాన్యాలలో కూడా ఐరన్ శాతం దండిగా దొరుకుతుంది. శరీరానికి అవసరమైన ఐరన్ దొరుకేస్తుంది.
  • అయితే, ఐరన్ బాగా తీసుకోవడం మాత్రమే కాదు, ఐరన్ ని శరీరం బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ సి కూడా అవసరం. కాబట్టి అటు ఐరన్ దొరికే ఆహారం, ఇటు విటమిన్ సి దొరికే ఆహారం .. రెండింటపై దృష్టి కేంద్రీకరించాలి.
Loading...

Popular Posts