సెలబ్రిటీలు బరువు తగ్గటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా ? దీన్ని సెలబ్రటీ జ్యూస్ గా పిలుస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఇది తక్కువ ఖర్చుతో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు

Loading...
సినిమా హీరోలు, హీరోయిన్లు ఏం తీసుకుంటారు. ఒక్కసారిగా సన్నబడతారు. సెలబ్రెటీలు ఏం తింటారు.. ఒక్క సారిగా బరువు అలా తగ్గిపోతారు. వారు ఎలాంటి జ్యూస్ లు తాగుతారు. తరచూ ఎక్కువ మందిని వేధించే ప్రశ్నలివి. బరువు తగ్గటం అత్యధికులకు ఓ ప్రధాన సమస్య. ఆహారపు అలవాట్లు.. పెరుగుతున్న టెన్షన్లతో చాలా మంది బరువు అమాంతం పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోక పోతే ఆరోగ్య సమస్యలు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. అయితే బరువును తగ్గించుకోవటం కోసం అనేక మార్గాలున్నా అన్నీ సురక్షితం కావు. సహజ సిద్దంగా తయారు చేసిన వాటితో బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా అన్న అనుమానాలు. వీటన్నటికి భిన్నంగా సెలబ్రిటీలు బరువు తగ్గటానికి ఏం జ్యూస్ వాడతారో చూద్దాం.. దీన్ని సెలబ్రటీ జ్యూస్ గా పిలుస్తారు.
కావాల్సినవి
ఒక స్పూన్ తేనె
ఒక కప్పు ద్రాక్ష లేదా ఆరెంజ్ లేదా నిమ్మకాయ రసం
2 స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్
తయారు చేసే విధానం
అన్నింటినీ కలిపివేయాలి. తేనె కరిగేదాకా కలపాలి. తయారు చేసిన ఈ డ్రింక్ ను రోజుకు మూడు సార్లు చొప్పున తాగాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. వారం రోజుల పాటు ఈ డ్రింక్ ను తాగాలి. ఆ తర్వాత ఓ వారం రోజులు విరామం ఇచ్చి మళ్లీ ఈ డ్రింక్ ను తీసుకోవాలి. ఈ డ్రింక్ ను రెండు వారాల పాటు తీసుకోవటం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు.
Loading...

Popular Posts