శ్రావణమాసం యొక్క గొప్పతనం మరియు అదృష్టం కలగాలంటే శ్రావణమాసం లో ఏం చేయాలి ఏం చేయకూడదు ?

 1. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ మాసం అంటే శుభ మాసం, పవిత్రమైన మాసంగా భావిస్తారు. 
 2. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. అందుకే.. ఈ నాలుగువారాలు.. చాలా భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. అలాగే ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాన్నిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్థోమతను, సమయాన్ని బట్టి ఏదో ఒక పూజాకార్యక్రమాల్లో పాల్గొనడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ పవిత్రమైన, శక్తివంతమైన శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల విశేష ఫలితాలు, అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే.. ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 
 3. ఈ శ్రావణ మాసంలో చాలా మంది శివుడికి ప్రత్యేకమైన సోమవారం ఉపవాసాలు ఉండి.. అభిషేకాలు చేస్తారు. ఇలా చేయడాన్ని శ్రావణ సోమవారం వ్రతం అని పిలుస్తారు. అలాగే మంగళవారం చేస్తే.. మంగళగౌరీ వ్రతం అని పిలుస్తారు. పెళ్లికాని స్త్రీలు ఈ వ్రతం చేస్తే.. శివుడి లాంటి భర్తను పొందుతారు. 
 4. హిందూ వేదాలు, పురాణాల ప్రకారం శ్రావణమాసం... శివుడిని పూజించడానికి ప్రత్యేకమని చెబుతాయి. అలాగే వివాహం, సంపద పొందడానికి కూడా ఈ నెలలో పూజలు నిర్వహించాలని సూచిస్తారు. 
 5. శ్రావణమాసం చాలా విశిష్టమైనది కావడం వల్ల అనేక పండుగలు ఈ నెలలోనే వస్తాయి. శ్రీకృష్ణ జన్మాస్టమి, రక్షాబంధన్, నాగ పంచమి, తేజ్ వంటి పండుగలు జరుపుకుంటారు. అలాగే.. పెళ్లిళ్లు చేయడానికి ఈ నెల చాలా పవిత్రమైనది. 
 6. శ్రావణ మాసం శివుడు భక్తులకు వరాలు కురిపిస్తారు. వాళ్ల తప్పులు క్షమించమని పశ్చాత్తాపంతోపూజలు నిర్వహిస్తే.. వాటిని మన్నించి.. విజయం సాధిస్తారు. అలాగే నెగటివ్ ఎనర్జీ తొలగించి, అదృష్టం ఆశీర్వదిస్తారు. ఈనెలలో శివపార్వతుల ఆశీర్వాదాలు పొందవచ్చు. 
 7. సూర్యోదయానికి ముందు నిద్రలేచి.. స్నానం చేసి.. శివాలయం దర్శించి.. పాలు, నీళ్లు కలిపిన పదార్థంతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నంతసేపు నిర్విరామంగా నమ: శివాయ అని ధ్యానించాలి. 
 8. ఇంటికి ఒక శివలింగం తీసుకొచ్చి.. ప్రతిరోజూ పూజించాలి. చల్లటి పాలు లింగంపై పోయాలి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. తర్వాత బిల్వపత్రాలు, పటిక బెల్లం సమర్పించాలి. 
 9. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లు మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం వల్ల.. ఫలితాలు పొందవచ్చు. 
 10. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, వివాహం ఎన్నిరోజులైనా అవకుండా ఉంటే.. శివలింగానికి ఈనెలలో కుంకుమార్చన చేయాలి. ఇలా చేసిన తర్వాత శివపార్వతుల అనుగ్రహం పొంది.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 
 11. తాజా పచ్చి గడ్డిని ఆవులకు శ్రావణ మాసంలో పెట్టడం వల్ల.. శ్రేయస్సు, అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. 
 12. ప్రతిరోజూ ఏదైనా నది, చిన్న నీటి గుంటను సందర్శించి.. చేపలకు ఆహారం పెట్టాలి. అలా చేపలకు ఆహారం పెట్టేటప్పుడు శివుడిని ధ్యానించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయి. 
 13. శ్రావణమాసంలో అన్నదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. పేదవాళ్లకు మీ ఇంట్లో భోజనం చేసి ప్రతిరోజూ పెట్టడం వల్ల.. ప్రశాంతత పొందుతారు. అలాగే మీ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ల ఆత్మకు శాంతి కలుగుతుంది. 
 14. ప్రతి సోమవారం 20 బిల్వాపత్రాలు తీసుకుని... దానిపై ఓం నమ: శివాయ అని గంధంతో రాసి.. శివలింగానికి సమర్పిస్తే.. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. 
 15. ఈ శ్రావణ మాసం అంతా.. గోమూత్రం తీసుకువచ్చి ఇల్లు మొత్తం చల్లుకుంటూ ఉండాలి. ప్రతి మూల చల్లుకుంటే.. పాజిటివ్ ఎనర్జీ పొందుతారు. 
 16. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకం లేదా సాధారణ అభిషేకం నిర్వహించడం వల్ల అన్ని రకాల మంగళ దోషాలు నివారించబడతాయి. 
 17. రుద్రాక్ష ధరించాలని భావిస్తే.. శ్రావణమాసంలో వేసుకోవడం చాలా పవిత్రమైనది. ఈ నెలలో రుద్రాక్షలు వేసుకుంటే.. చాలా ఫలితాలు పొందుతారు. 
 18. బిల్వపత్రాలు ఎప్పుడు పీకరాదు శివుడికి బిల్వపత్రాలు సమర్పించడం విశిష్టమైనదే కానీ.. అష్టమి, చతుర్ధసి, నవమి, అమావాస్య, సోమవారం వీటిని పీకరాదు. 
 19. శ్రావణమాసంలో సాయంత్రం పూట శివపార్వతుల హారతి ఇస్తే.. శివుడి అనుగ్రహం పొందుతారు. మంచి భాగస్వామిని పొందుతారు. 
 20. శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయకపోవడం వల్ల ప్రశాంతత కోల్పోకుండా, సంపద తరిగిపోకుండా ఉంటుంది. 
 21. శ్రావణ మాసంలో మాంసాహారం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తీగా మానేయాలి. 
 22. శ్రావణ మాసంలో ఎట్టిపరిస్థితుల్లో పాములను చంపకూడదు. శివుడిని చాలా ప్రీతికరమైనది కాబట్టి.. పాములను పూజించాలి. చంపకూడదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)