కాలరీలు బాగా బర్న్ చేసి, కొవ్వుని బయటకు తరిమేసే ఆహారాలు

జీవక్రియ ఎంతా బాగా ఉంటే, మన శరీరం అంత శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జీవక్రియను మెరుగుపరుచుకోవడానికి కొన్నిరకాల ఆహారాలు ఉన్నాయి. ఇవి బరువుని, కొవ్వుని తగ్గించడానికి ఉపయోగపడతాయి. వీటిని నెగెటివ్ - కాలరీ ఫూడ్స్ అని అంటారు. మంచి వ్యాయామంతో పాటు ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు మీ డైట్ లో చేర్చుకుంటే మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది.
  • చికెన్, చేపల్లో దొరికే లీన్ ప్రొటీన్ వలన మెటబాలిజం మెరుగ్గా అవుతుంది. ఇవి అరగాలంటే శరీరం మిగితా ఆహారాలతో పోల్చుకుంటే ఎక్కువ శక్రి ధారపోయాలి. తద్వారా కొవ్వు, కాలరీలు బాగా కరుగుతాయి.
  • ధాన్యాలు కూడా మెటబాలిజం మెరుగుపడటానికి సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు ధాన్యాలను ఆశ్రయిస్తే మంచిది. ఇవి ఒంటిలో కొవ్వు చేరనివ్వవు. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్‌ లో ఉంచి శరీరానికి తగినంత శక్తినిస్తాయి.
  • వెల్లుల్లి బరువు తగ్గాలనుకునేవారికి అద్భుత ఔషధం. ఇది జీవక్రియను మెరుగుపరిచి శరీరం కొవ్వుని జమ చేయకుండా ఆపుతుంది. మనం చేసే పనుల్లో కాలరీలు కూడా ఎక్కువగా బర్న్ చేస్తుంది.
  • బ్లూబెర్రి, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెరి లాంటి ఫలాల్లో ఫైబర్ బాగా దొరుకుతుంది. ఇవి కాలరీలు బాగా బర్న్ చేసి, కొవ్వుని బయటకుతీసి, జీవక్రియకు ఎన్నోవిధాలుగా సహాయం చేస్తాయి.
  • సిట్రస్ జాతికి చెందిన ఫలాలు .. అంటే ఆరెంజ్, నిమ్మ లాంటివి. ఇంకా ద్రాక్షపళ్ళలో విటిమిన్ సి బాగా లభిస్తుంది. విటమిన్ సి కొవ్వుని కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
  • ఇవన్ని తినడం వరకు మాత్రమే కాదండోయ్ టైం కి భోజనం చేయడం కూడా చాలా ముఖ్యం.

Popular Posts

Latest Posts