కేవలం ఒక బ్రెడ్ ముక్కను వాడి దంతాలను మిలమిలా మెరిసిపోయేలా చేసే సింపుల్ టెక్నిక్ ఇది

Loading...
మనిషి ఆరోగ్యంలో దంతాలది అత్యధిక ప్రాధాన్యం. దంతాలు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లే. అయితే ఆహారపు అలవాట్ల వల్ల దంతాల శుభ్రత లోపించటం, రంగుమారి పోయి అసహ్యంగా కనిపించటం లాంటి ఇబ్బందులను అనేక మంది ఎదుర్కొంటున్నారు. అలాంటి దంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, మిలమిలా మెరిసిపోయేలా చేసేందుకు సింపుల్ టెక్నిక్ ఇది. కేవలం బ్రెడ్ ను వాడి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. మీరు విన్నది నిజమే. ఒక బ్రెడ్ ముక్కను వాడి దంతాలను శుభ్రం ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
  • మందంగా ఉన్న బ్రెడ్ ను తీసుకోవాలి.
  • గ్యాస్ స్టౌవ్ మంటపైన బ్రెడ్ ను కాల్చాలి.
  • కాస్త బ్రౌన్, బ్లాక్ కలర్ లోకి వచ్చే వరకు బ్రెడ్ ను మంటపైనే ఉంచాలి.
  • మరీ మాడిపోయేంత వరకు కాల్చకూడదు.
  • ఇప్పుడు అలా కాల్చిన బ్రెడ్ ను రెండు ముక్కలుగా విరగ్గొట్టి తెలుపు, నలుపు బాగాలను మార్చి, మార్చి 4-5 నిమిషాలు పళ్లను రుద్దాలి.
  • అలా రుద్దిన వెంటనే నోటిని నీటితో కడుక్కోకుండా 5 నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అర్దగంటపాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
  • కాల్చిన బ్రెడ్ తో ఇలా చేయటం వల్ల మీ దంతాలను పాలిష్ చేస్తుంది. పళ్లపై గారను తొలగిస్తుంది.
  • దీంతోపాటు రోజు పడుకొనే ముందు బ్రష్ చేసుకోవటం వల్ల దంతాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి. 
  • పసుపు పచ్చగా పళ్లు ఉంటే ఈ టెక్నిక్ తో వాళ్ల దంతాలు మెరిసిపోతాయి.
Loading...

Popular Posts