అతి త‌క్కువ స‌మ‌యంలోనే బొద్దింక‌ల‌న్నింటినీ స‌హ‌జ సిద్ధంగా త‌రిమికొట్టే పవర్ ఫుల్ పద్ధతి

Loading...
బొద్దింక‌లు… ఈ పేరు చెబితే చాలు కొంద‌రికి ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తుంది. ఇంకొంద‌రైతే వాటిని చూస్తే దూరంగా పారిపోతారు. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌గా ఇలా అనిపిస్తుంది. అయితే నేటి త‌రుణంలో ఎక్క‌డ ఏ ఇంట్లో చూసినా వీటి బాధ ఎక్కువ‌గానే ఉంది. వీటిని తరిమికొట్ట‌డం కోసం అంద‌రూ నానా తంటాలు ప‌డుతూనే ఉన్నారు. కానీ కింద ఇచ్చిన ఓ టిప్‌ను పాటిస్తే అతి త‌క్కువ స‌మ‌యంలోనే బొద్దింక‌ల‌న్నింటినీ త‌రిమి కొట్ట‌వ‌చ్చు.
  • ఒక కోడిగుడ్డును తీసుకుని ప‌గ‌లగొట్టి అందులోని పచ్చ సొన‌ను మాత్రమే ఒక గిన్నెలో వేరుచేయాలి. 
  • 50 గ్రాముల బోరిక్ యాసిడ్ పౌడ‌ర్ (మార్కెట్‌లో దొరుకుతుంది)ను బాగా కల‌పాలి. దీంతో అది మెత్త‌ని పేస్ట్‌లా మారుతుంది. 
  • ఆ పేస్ట్‌ని చిన్న చిన్న బాల్స్‌లాగ త‌యారు చేసుకోవాలి. అనంత‌రం వాటిని నీడ‌లో ఎండ‌నివ్వాలి. కొంత సేపటికి అవి పొడిగా మారుతాయి. వాటిని తీసుకుని బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో పెట్టాలి. అంతే..!
పైన చెప్పిన టిప్‌తో బొద్దింక‌లు త్వ‌ర‌గా నాశ‌న‌మ‌వుతాయి. అయితే బొద్దింక‌ల‌ను త‌రిమికొట్టేందుకు మార్కెట్‌లో మ‌న‌కు అనేక ర‌కాల స్ప్రేలు అందుబాటులో ఉన్నా అవ‌న్నీ విష పూరిత‌మైన‌వి. కానీ పైన చెప్పింది స‌హ‌జ సిద్ధంగా త‌యారు చేసింది. కాబ‌ట్టి దాంతో ఎలాంటి భ‌యం లేదు. నిర‌భ్యంత‌రంగా వాడుకోవ‌చ్చు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...