మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులే మన జుట్టుని సర్వ నాశనం చేస్తాయి

మనమంతా మన జుత్తు అందంగా మృదువుగా, మెరిసేలా ఉండడమే కాకుండా జుత్తు రాలకుండా ఉండాలని కోరుకుంటాం. వాస్తవంగా మన జుత్తు అందం మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి ఉంటుంది. మనలో చాలామంది తమకు తెలియకుండానే జుత్తు విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దానివలన దీర్ఘ కాలంలో మీ జుత్తు పాడవుతుంది. 
  • దువ్వెనలు సాధారణంగా శుభ్రపరచకపోవడం
డస్ట్ తో ఉన్న బ్రష్ వలన దుమ్ము కణాలు, నూనెలు నెత్తి మీద పేరుకుపోయి  జుట్టును నాశనం చేస్తాయి. అందుకే మీ జుట్టుకు వాడే బ్రష్ ను వారానికి ఒక రోజైనా సబ్బు మరియు, వేడి నేటితో శుభ్రపరచండి.
  • చాలా తరచుగా షాంపూ వాడడం
పొడవాటి జుత్తు ఉన్నవారు రోజూ షాంపూ పెట్టడానికి ఇష్టపడుతుంటారు. అయితే దీనివలన కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. చాలా షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉండి, జుట్టులో ఉండే సహజసిద్దమైన నూనెలను పీల్చుకొని జుట్టును బాగా పొడిబారేలా చేస్తాయి. అందుకే మీ జుట్టును వారానికి రెండు సార్లు షాంపూ పెట్టుకుంటే మంచిది.
  • షాంపూ మొత్తాన్ని తొలగించకపోవడం
షాంపూ జుట్టులో ఉన్న మురికిని, నూనెలను తొలగిస్తుంది. మీరు పూర్తిగా షాంపూ పోయేవరకు కడగకపొతే మీ జుత్తు పై షాంపూ మిగిలి ఉండి మళ్ళీ మురికి తొందరగా పేరుకు పోయేలా చేస్తుంది.
  • హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించేముందు మీ జుట్టును పొడిగా ఉంచకపోవడం
హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించేముందు జుట్టును పొడిగా ఉంచకపోవడమనే తప్పును మనలో చాలామంది చేస్తుంటారు. అలా చేస్తే జుట్టులో ఉన్న నీరు ఆ ఉత్పత్తుల్లో కలిసి దాన్ని పలుచగా చేస్తుంది. దీంతో దాని ఫలితం పోతుంది. అందుకే హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించేముందు మీ జుట్టును పొడిగా ఉంచుకోండి.
  • టవల్ తో మీ జుట్టును ఆరబెట్టడం
టవల్ తో మీ జుట్టును ఆరబెడితే బాగున్నట్టు అనిపిస్తుంది కాని అది కరక్ట్ కాదు అంటున్నారు నిపుణులు. టవల్ తో జుత్తు ఆరబెట్టడం వలన మీ జుత్తు మొదలు పాడవడమే కాకుండా పైపొర విడిపోతుంది. అందువలన మీరు టవల్ బదులు కాటన్ టి షర్ట్ తో మీ జుట్టును ఆరబెట్టడం మంచిది.
  • తల స్నానం చేసేముందు మీ జుట్టును దువ్వుకోకపోవడం
మీరు తల స్నానం చేసేముందు దువ్వుకొని స్నానం చేస్తే మంచిది. తడి జుత్తు తొందరగా పాడవడమే కాకుండా, జుత్తు రాలిపోతుంది. దువ్వుకోవడం వలన జుట్టులో ఉన్న చిక్కులు వీడి జుత్తు పాడవకుండా ఉంటుంది.
  • జుట్టు పూర్తిగా ఆరకుండా పడుకోవడం
సాదారణంగా తడి జుత్తు బలహీనంగా ఉంటుంది. తడి జుట్టుతో పడుకోవడం వలన మీ జుత్తు తొందరగా పాడవుతుంది. మీ జుట్టును పగిలేట్టు కూడా చేస్తుంది.
  • ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం
చాలా మంది తలస్నానం చేసేప్పుడు ఎక్కువ వేడి నీటిని ఉపయోగిస్తుంటారు. వేడి నీరు మీ జుట్టులో రంగును తొలగించి నూనె ఉత్పత్తి చేసే గ్రంధులను యాక్టివేట్ చేస్తుంది. గోరువెచ్చని నీరు ఉపయోగిస్తే జుట్టులో ఉన్న మురికిని తొలగించి, రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)