క్యాబేజి వలన కలిగే అద్భుతమైన లాభాలు - బరువు తగ్గాలన్నా రోగనిరోధక శక్తీ పెరగాలన్నా

Loading...
క్యాబేజీ మనకు చాలా సామాన్యంగా దొరికే గ్రీన్ లీఫ్ వెజిటబుల్. చవగ్గా దొరికే వస్తువే, మన డెయిలీ రొటీన్ లో దీన్ని ఒక భాగంగా మాత్రం చేర్చుకోవట్లేదు చాలామంది. కాని క్యాబేజీలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
  • క్యాబేజీలో విటమిన్ కె, ఇ, సి, బి1, బి6, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఐయోడిన్, లభిస్తాయి.
  • క్యాబేజిలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఇది ఫ్రీరాడికల్స్ విముక్తినివ్వడమే కాదు, రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • అల్సర్ ని నివారించడంలో క్యాబేజిది పెద్ద చేయి అని చెప్పొచ్చు. ఇది పేగులను శభ్రపరచడానికి సహాయపడుతూ సెస్కి అల్సర్, అక్యూట్ ఆల్సర్ ని దూరం పెడుతుంది.
  • కొలస్టిరాల్ లెవెల్స్ ఎక్కువుండి బాధపడేవారు తమ డైట్ లోకి చేర్చుకుంటే మంచిది.
  • క్యాబేజిలో ఉండే హిస్టిడైన్ ఇమున్యూ సిస్టమ్ ని బలపోతం చేస్తుంది. బాడిలో రెసిస్టెన్స్ పవర్ ని పెంచి, తరచుగా జ్వరం, జలుబు లాంటి సమస్యలతో బాధపడకుండా కాపాడుతుంది.
  • కొన్నిరకాల క్యాన్సర్లు శరీరంలో పెరగకుండా అడ్డుకునే శక్తి క్యాబేజిలో ఉన్నట్లు పలు పరిశోధనలు తెలిపాయి.
  • క్యాబేజిలో లభించే గ్యూటమిన్ అనే అమినో ఆసిడ్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.
  • కొవ్వుని కంట్రోల్ చేయడంలో, షుగర్‌ లెవెల్స్ కి చెక్ పెట్టడంలో క్యాబేజీ పెద్ద నేర్పరి.
  • క్యాబేజిలో కాలరీలు కూడా తక్కువ స్థాయిలో ఉండటం వలన న్యూట్రీషన్స్ చాలామంది డైట్ లో క్యాబేజీ చేర్చుకొమ్మని సలహాలు ఇస్తారు.
Loading...

Popular Posts