అన్ని రోగాలకు మూలం మలబద్దకం. ఇది చాలా డేంజర్. ఈ సింపుల్ టిప్స్ తో మలబద్దకాన్ని తరిమికొట్టచ్చు

Loading...
  • రోజూ రాత్రి నిద్ర‌పోయే ముందు ఒక గ్లాస్ వేడి పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే మ‌ల విస‌ర్జ‌న సాఫీగా జ‌రుగుతుంది. అయితే పాల‌లో కొద్దిగా ఆముదం క‌లుపుకుని తాగితే ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంది.
  • ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగాలి. రోజుకు 3 సార్లు ఇలా చేస్తే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది.
  • ఎండు ద్రాక్ష (కిస్మిస్‌) పండ్ల‌ను ఎక్కువ‌గా తింటున్నా మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇవి జీర్ణ‌క్రియ సాఫీగా అయ్యేలా చూస్తాయి.
  • రాత్రి పూట భోజ‌నంలో అన్నం కాకుండా గోధుమ పిండితో చేసిన చ‌పాతీలు తిన్నా మ‌రుస‌టి రోజు ఉద‌యం విరేచ‌నం సాఫీగా జ‌రుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య పోతుంది.
  • రాత్రి పూట భోజ‌నం చేసిన త‌రువాత కొంత సేప‌టికి పైనాపిల్‌ను తింటే జీర్ణ‌క్రియ స‌రిగ్గా జ‌రిగి మ‌రుస‌టి రోజు ఉద‌యం విరేచ‌నం సుల‌భంగా జ‌రుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం కూడా తొల‌గిపోతుంది.
  • క‌ర‌క్కాయ‌, ఉసిరికాయ‌, తానికాయ‌ల‌ను పొడి చేసి వాట‌న్నింటినీ క‌లిపి త‌యారు చేసే త్రిఫ‌లా చూర్ణాన్ని రాత్రి పూట తీసుకుంటుంటే మ‌ల‌బ‌ద్ద‌క స‌మస్య పోతుంది.
  • రాత్రి పూట భోజనంతోపాటు ఒక టీస్పూన్ క‌రివేపాకు పొడిని తీసుకుంటే మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది.
  • కొద్దిగా ఆముదాన్ని వేడి చేసి రాత్రి స‌మ‌యంలో తీసుకుంటున్నా మ‌ల‌బ‌ద్దకాన్ని వ‌దిలించుకోవ‌చ్చు.
  • రాత్రి పూట ఒక రాగి చెంబులో నీటిని ఉంచి తెల్ల‌వార‌గానే ఆ నీటిని తాగితే విరేచ‌నం సుల‌భంగా జ‌రుగుతుంది.
Loading...

Popular Posts