అరటిపండు తొక్కతో ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

Loading...
అరటి పండును తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు మేలు చేసే ఎన్నో ర‌కాల పోష‌కాలు అర‌టి పండ్ల‌లో ఉన్నాయి. అయితే కేవ‌లం అర‌టిపండే కాదు దాని తొక్క‌తో కూడా మ‌న‌కు అనేక లాభాలే ఉన్నాయి.
  • దంతాల సంర‌క్ష‌ణ‌కు అర‌టి పండు తొక్క బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అర‌టి పండు తొక్క లోప‌లి భాగాన్ని దంతాల‌పై రోజూ రుద్దాలి. క‌నీసం ఇలా వారం పాటు చేస్తే దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి. 
  • కాలిన గాయాలు, దెబ్బ‌ల‌కు అర‌టి పండు తొక్క ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. స‌మ‌స్య ఉన్న ప్రాంతంపై అర‌టి పండు తొక్క‌ను ఉంచి క‌ట్టు క‌ట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒక‌టి, రెండు రోజుల్లోనే దెబ్బ‌లు మానిపోతాయి. 
  • ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకునేందుకు అర‌టి పండు తొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. 
  • అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అర‌టి పండు తొక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంది. అర‌టి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అర‌గంట సేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డిగేయాలి. దీంతో పైన చెప్పిన చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం ఆరోగ్యాన్ని సంత‌రించుకుంటుంది.
  • చ‌ర్మంపై ఏర్ప‌డే దుర‌ద‌లు, మంట‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ అర‌టి పండు తొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై అర‌టి పండు తొక్క‌ను రాసి 10 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీంతో దుర‌ద‌, మంట త‌గ్గిపోతుంది. 
  • శ‌రీరంలో ఏదైనా భాగం నొప్పిగా ఉంటే అక్క‌డ అర‌టి పండు తొక్క‌ను కొద్దిసేపు మ‌సాజ్ చేసిన‌ట్టు రాయాలి. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే నొప్పి మాయ‌మ‌వుతుంది. 
  • పురుగులు, కీట‌కాలు కుట్టినచోట దుర‌ద‌గా ఉన్నా అర‌టి పండు తొక్క‌ను రాస్తే చాలు. వెంట‌నే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.
Loading...

Popular Posts