బొప్పాయి ఆకుల రసంతో సంచలనం - వారం రోజుల్లో డెంగీ జ్వరం పూర్తిగా నయం - ఈ రసాన్ని తయారుచేసే విధానం వాడే విధానం కోసం

సంచలనాలు సృష్టిస్తున్న బొప్పాయి ఆకు రసం.. అవును మీరు విన్నది నిజమే. మనం సాధారణంగా బొప్పాయి పండును తింటాము. ఈ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్న్నాయి. కానీ ఈ బొప్పాయి ఆకులతో ఏంటి లాభాలు అనుకుంటున్నారా అయితే మిరే చూడండి..
ఈ మధ్యకాలంలో డెంగ్యు జ్వరం తీవ్రంగా బాదిస్తోంది. కొంతమంది చనిపోతుండగా మరికొంతమంది తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఈ జ్వరం వచ్చిన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో ఒక చోట కూర్చుని ఉండలేరు, నిల్చొని ఉండలేరు. కేవలం మంచానికి పరిమితం కావాల్సి ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఇది మరింత తీవ్రతరమయి ప్రాణానికి ప్రమాదం కలిగిస్తుంది. డెంగ్యు వచ్చిన వారిలోని రక్తం లో ప్లేట్ లేట్ల సంఖ్య బాగా తగ్గి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. సాదారణ వ్యక్తుల్లో ప్లేట్ లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ఉండగా డెంగ్యు వచ్చిన వారిలో ప్లేట్ లెట్ల సంఖ్య 1.5 లక్షల కంటే తగ్గుతుంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఇవి మరింత క్షీణించి వేల సంఖ్యకు పడిపోయి రోగిని తీవ్ర అనారోగ్య పరిస్థితి కి గురిచేస్తాయి. వీటిని పెంచడం కోసం డాక్టర్లు కొన్ని మందులు విటమిన్ సప్లిమెంట్లు ఇస్తుంటారు. రోగి కొద్దిగా కోలుకున్నత‌రువాత డిశ్చార్జి చేస్తారు.

కానీ కొన్ని రోజులవ‌ర‌కు వారు మందుల‌ను స‌క్ర‌మంగా తీసుకోవాల్సిందే. స‌రైన ఆహారం తినాల్సిందే. లేదంటే రోగం మ‌ళ్లీ తిర‌గ‌బెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే అలాంటి వారు కింద సూచించిన విధంగా ఓ చిట్కాను పాటిస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను త్వ‌ర‌గా పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది. ఇంత‌కీ ఆ మందు త‌యార‌య్యేది బొప్పాయి ఆకుల‌తోనే... బొప్పాయి పండు ఆకుల‌తో త‌యారు చేసిన ఓ మిశ్ర‌మాన్ని సేవించ‌డం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పెంచుకోవ‌చ్చు. 

  • మిశ్రమం తయారు చేసే విధానం :-
కొన్ని బొప్పాయి ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. వాటిని మిక్సీలో వేసి దాంతోపాటు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీరు, ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం, చిటికెడు ప‌సుపుల‌ను కూడా వేయాలి. అనంత‌రం అన్ని ప‌దార్థాల‌ను బాగా మిక్సీ ప‌ట్టాలి. అప్పుడు వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌బోసి, దానికి కొంత తేనె క‌లిపి నిత్యం రెండు పూట‌లా తీసుకోవాలి. డాక్ట‌ర్ ఇచ్చిన మెడిసిన్స్‌తో పాటు ఈ మిశ్ర‌మాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడే గుణం క‌నిపిస్తుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పెర‌గ‌డ‌మే కాదు, త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటారు కూడా.

Popular Posts

Latest Posts