ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఈ 8 ఐటమ్స్ లో ఏదో ఒకటి తింటే బరువు తగ్గుతారు పొట్ట కూడా మంచి షేప్ వస్తుంది

Loading...
  • బరువు తగ్గాలనే ఆలోచనలో ఉండేవాళ్లు చాలామంది.. బ్రేక్ ఫాస్ట్ ని మిస్ చేస్తుంటారు. కానీ.. ఇది.. చాలా పెద్ద పొరపాటు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు తగ్గడం కాదు.. బరువు పెరగడానికి, ఫ్యాట్ పేరుకోవడానికి కారణమవుతుంది. అల్పహారం తీసుకోకపోతే.. నెక్ట్స్ టైమ్ తినే భోజనం క్వాంటిటీ పెరిగి.. బరువు పెరుగుతారు. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ రోజంతటికీ కావాల్సిన శక్తిని ఇస్తుంది. అలాగే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల అదనపు బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుందని అధ్యయనాలు తేల్చాయి. ఎనర్జీని అందించడమే కాకుండా.. క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్, ఐరన్, ఫైబర్ బ్రేక్ ఫాస్ట్ ద్వారా పొందేలా జాగ్రత్తపడాలి. ఇవి గ్లూకోజ్, కార్బోహైడ్రేట్ లెవెల్స్ ని పెంచి.. అనేక వ్యాధులను అరికడతాయి. కాబట్టి.. హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్స్ ని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు, బెల్లీ ఫ్యాట్ ని కూడా కరిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూద్దాం..
  • ఓట్స్ ఓట్స్ లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కావాల్సిన ఎనర్జీ అందించడానికి, బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ఓట్స్ చక్కటి ఆహారం. అలాగే ఓట్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. పొట్టనిండిన ఫీలింగ్ ఎక్కువ సమయం ఉండేలా చేస్తాయి.
  • ఎగ్స్ ఎగ్స్ లో ప్రొటీన్ తో పాటు, ఫ్యాట్ కరిగించే.. కోలైన్ అనే పోషకం ఉంటుంది. ఒక రోజు ఒక గుడ్డుని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం వల్ల.. చాలా తేలికగా.. బెల్లీ ఫ్యాట్ కరిగించవచ్చు.
  • పెరుగు పెరుగులో ప్రొటీన్, ప్రొబయోటిక్ ఎక్కువగా ఉంటుంది. ఇది.. పొట్ట చుట్టూ ఫ్యాట్ చేరుకోకుండా అడ్డుకుంటుంది. అలాగే.. బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు తీసుకోవడం వల్ల.. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
  • యాపిల్స్ యాపిల్స్ లో ఫైబర్స్, అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక యాపిల్ తీసుకోవడం వల్ల.. ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. దీనివల్ల అతిగా తినకుండా ఉండవచ్చు. అలాగే.. పొట్టలో పేరుకున్న ఫ్యాట్ ని కరిగిస్తుంది.
  • బాదాం బాదాంను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే.. ఫ్యాట్ కి దూరంగా ఉండవచ్చు. ప్రొటీన్, మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఆల్మండ్స్ లో ఉండటం వల్ల.. ఇది.. బాడీ మాస్ ఇండెక్స్ మెయింటెయిన్ చేయడానికి సహాయపడుతుంది.
  • వాల్ నట్స్ వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ ని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే.. మెటబాలిక్ రేట్ సజావుగా ఉంటుంది. అలాగే.. గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
  • అరటిపండు అరటిపండులో పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఓట్స్ తో కలిపి తీసుకుంటే.. ఫ్యాట్ తో పోరాడుతుంది. అలాగే.. బెల్లీ చుట్టూ ఉన్న ఫ్యాట్ ని కరిగిస్తుంది.
  • పాలకూర పాలకూర లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు.
Loading...

Popular Posts