ఈ 8 సంకేతాలు ఎదురయ్యాయి అంటే దగ్గరలోనే మీకు అదృష్టం వరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి

Loading...
  • సాధారణంగా కొంతమందికే అదృష్టం ఉంటుందని, మంచి సంపన్నులు అవుతారని, మంచి భవిష్యత్ ఉంటుందని కొంతమంది నమ్ముతారు. మరికొందరు.. కష్టపడి పనిచేసినప్పుడు మనం ధనవంతులు అవుతామని, చెబుతుంటారు. అయితే.. కొన్ని సంకేతాలు మీలో కనిపించినా.. మీకు ఎదురైనా.. మీరు అదృష్టం పొందుతారని.. రకరకాల శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఎదురయ్యాయి అంటే.. మీకు దగ్గరలోనే అదృష్టం ఉందని తెలుపుతాయి. మరి ఆ సంకేతాలంటే చూద్దాం.. 
  • నిద్రలేవగానే.. కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించింది అంటే.. ఏదో ఒకవైపు నుంచి మీకు అదృష్టం రాబోతోందని సంకేతం.
  • నిద్రలేవగానే ఆవు గడ్డి తింటూ కనిపిస్తే అది మీకు అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతం.
  • తెలుపు లేదా గోల్డ్ కలర్ పాముని కలలో చూశారంటే.. త్వరలోనే మీరు అదృష్టవంతులు కాబోతున్నారని, ధనం మీ దగ్గరకు వస్తోందని సంకేతం
  • ఒకవేళ మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని భావిస్తున్నప్పుడు, బయలుదేరిన తర్వాత కోతి, కుక్క, పాము, పక్షి.. ఏదైనా మీ వాహనానికి కుడివైపుగా ఉంది అంటే.. మీరు త్వరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని సంకేతం.
  • మీరు మీ కలలో పచ్చని పొలాలతో పాటు నీటిని చూశారంటే.. త్వరలోనే ఊహించని విధంగా అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం.
  • నిద్ర లేచిన తర్వాత లేదా ఏదైనా ముఖ్యమైన పనికోసం బయలుదేరినప్పుడు.. చెరుకు గడలు కనిపిస్తే త్వరలోనే.. మీరు అదృష్టవంతులు కాబోతున్నారని సంకేతం.
  • మీరు బయటకు వెళ్లేటప్పుడు.. పెళ్లైన మహిళ.. ముఖంపై సింధూరంతో కనిపించిందంటే.. అది చాల శుభ సూచకం.
  • సాధారణంగా.. ఇండియన్స్ గబ్బిలాలకు దూరంగా ఉంటారు. కానీ.. చైనీస్ మాత్రం గబ్బిలాలను శ్రేయస్సుగా భావిస్తారు. అవి ఇంట్లోకి అనుకోకుండా వచ్చాయంటే.. దురదృష్టంగా భావిస్తారు. కానీ.. అవి ఇంట్లో గూడు ఏర్పాటు చేశాయంటే.. త్వరలోనే సంపద పొందుతారని సంకేతమట.
Loading...

Popular Posts