నడుము నొప్పి బాధిస్తుందా ? నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు అద్భుతమైన 6 చిట్కాలు

నడుము నొప్పి సమస్యతో సతమతమయ్యేవారికే ఆ బాధ ఎంతటి తీవ్రంగా ఇబ్బందిపెడుతుందో తెలుస్తుంది. ఈ నడుము నొప్పిని భరించడం చాలా కష్టమవుతుంటుంది. ఐతే ఆయుర్వేద వైద్యంలో నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
  • ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది. 
  • అలాగే అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణ కోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. 
  • ఆవనూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడినీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.
  • నడుము నొప్పితో బాధపడేవారు... వంకాయ, వేరుశనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువుగా తీసుకోవడం మంచిది కాదు.
  • లావుగా ఉన్నవారికి నడుం నొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మ రసం పోసి పరగడుపున త్రాగుతుంటే, ఒళ్ళు తేలిక పడి నొప్పి తగ్గుతుంది. 
  • ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను నడుంచుట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది.

Popular Posts

Latest Posts