కేవలం 5 రూపాయల కొత్తిమీరతో ప్రేగులని, కిడ్నీలను శుభ్రం చేసుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండండి

Loading...
తినే ఆహారం, తాగే నీరు ద్వారా శరీరానికి అవసరమయిన మాంసకృత్తులు, పోషక విలువలు సమకూరడంతో పాటు రక్తంలో కలవని లవణాల వల్ల అది కలుషితమవుతూ వుంటుంది. ఒక్కోసారి రక్తం విషపూరితమయ్యే ప్రమాదం కూడా వుంటుంది. ఇలా కలుషితమయిన రక్తాన్ని వడపోసి అనవసర లవణాలను తొలగించి వాటిని మూత్రం, చెమట ద్వారా శరీరం నుంచి బయటకు పంపడానికి మూత్రపిండాలు(కిడ్నీలు) పనిచేస్తుంటాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కొందరిలో అనవసర లవణాలు పేరుకుపోయి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. ఇవే కిడ్నీ సంబంధమయిన వ్యాధులు. ఇవి బాగా ముదిరితే, కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడం, మూత్రపిండాలు దెబ్బతిని వాటి స్తానంలో కృత్రిమంగా రక్తాన్ని శుద్ధిచేసే డయాలసిస్ వంటి ఖరీదయిన వైద్యం తప్పనిసరి అయ్యే ముప్పు పొంచుకుని వుంటుంది.

కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిబారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముదిరిపోయిన తరువాత చేసే చికిత్స కంటే నివారణ మేలు కదా. మన కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసి అందులో ఉండే లవణాలను, బాక్టీరియాను తొలగిస్తుంది. అయితే ఈ ప్రక్రియలో కొంత లవణం మన కిడ్నీల్లో పేరుకుపోతుంది. దీన్ని మనం ఎలా తొలగించాలి..?
దానికోసం ఒక చిన్న చిట్కా ఉంది:
చిన్న సైజు కొత్తిమీర కట్ట తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడగండి. రెండు లీటర్ల నీళ్లు పోసి 10 నిమిషాల పాటు మరిగించండి. దాన్ని వడబోసి ఒక సీసాలోకి తీసుకొని ఆ సీసాను ఫ్రిజ్ లో పెట్టుకొండి. ప్రతీ రోజు ఈ రసం ఒక గ్లాసు తాగితే ప్రేగులు శుభ్రపడతాయి, కిడ్నీలో లవణాలన్నీ మూత్రం ద్వారా బయటకుపోతాయి. కొద్ది రోజుల తరువాత మీలో కలిగే మార్పును మీరే గమనించగలుగుతారు. కొత్తిమీర ప్రకృతిలో దొరికే సహజసిద్దమైన ఆయుర్వేదం లా కిడ్నీలను శుభ్రపరుస్తుంది.
Loading...

Popular Posts