జ్యూస్‌లతో కూడా బరువు తగ్గించుకోవచ్చని చాలా మందికి తెలీదు. ఈ 5 రకాల జ్యూస్ లు వారానికి ఒక సారి తాగిన చాలు బరువు తగ్గుతారు

Loading...
ఈ మధ్య కాలంలో ఏ ఆహారం తిన్నా విపరీతంగా ఒళ్లు చేస్తుంది. నిజానికి బయట దొరికే జంక్ ఫుడ్స్‌కి అలవాటు పడ్డవారికి వెంటనే ఒళ్లు పెరగడం, పొట్టరావడం జరుగుతోంది. వీటిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. సాధారణంగా ఎందుకు బరువు తగ్గాలనుకొంటారు..? శరీరం నాజుగ్గా ఉంచుకోవడం కోసమని కొందరు, ఆరోగ్యం కోసమని ఇంకొందరు చెబుతుంటారు. ఏదేమైన వయస్సుకు మించిన బరువు ఉండటం ఆరోగ్యానికి హానికరమే. అయితే ఆ బరువును తగ్గించుకోవడానికి కొందరు గంటల తరబడి జిమ్ కెళుతుంటారు. అలా కాకుండా జ్యూస్‌లతో కూడా బరువు తగ్గించుకోవచ్చని చాలా మందికి తెలీదు. అలాంటి జ్యూస్ లేంటో ఇప్పుడు చూద్దాం...
  • ఉదయం 6 గంటలకు కొత్తిమీర జ్యూస్‌లో ఒక అరచెక్క నిమ్మరసం కలిపి తీసుకుంటే వారంలో బరువు తగ్గుతుంది.
  • ఉదయం 11 గంటలకు ఒక గ్లాస్ బత్తాయి రసం తీసుకోవాలి.
  • మధ్యాహ్నం 1 గంటకి బొప్పాయి జ్యూస్ రెండు గ్లాసులు తీసుకోవాలి.
  • సాయంత్రం 4 గంటలకి కమలాపండ్ల రసం ఒక గ్లాస్ తీసుకోవాలి.
  • రాత్రి 8 గంటలకు కీరదోసకాయ జ్యూస్ తీసుకోవాలి.
  • రాత్రి పడుకునేముందు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి.
ఇలా చేస్తే పొట్ట మొత్తం శుభ్రమై మెటబోలిక్ రేట్ పెరిగి జీర్ణశక్తి పెరిగి చెడ్డ కొలెస్ట్రాల్ కరుగుతుంది. సో మీరు ట్రై చేయండి.
Loading...

Popular Posts