అవి ఇవి కాదు పొద్దునే గుప్పెడు మొలెకెత్తిన గింజలు తినండి చాలు 40 కాదు 80 సంవత్సరాలు వచ్చినా కింగ్ లా స్ట్రాంగ్ గా ఉంటారు

గుప్పెడు మొలకలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి చెప్పుకుంటే ఎంత చెప్పుకున్న తక్కువే. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు మొలకలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది.
  • పెసలు: ఈ మొలకల్లో విటమిన్‌ C, K అధికంగా లభిస్తాయి. విటమిన్‌ C జుట్టు ఎదుగుదలకు బాగా ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం వీటి సొంతం. పెసర పొట్టులో ఫొలేట్‌ అధికంగా ఉంటుంది. గర్భిణులకూ, గర్భస్థ శిశువుకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భిణులు ఇంట్లోనే మొలకెత్తించుకుని తీసుకోవడం మంచిది. పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకూ ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అలాని అతిగా మాత్రం తినకూడదు. గ్యాస్‌ సమస్య ఎదురుకావొచ్చు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్లూ, బ్యాక్టీరియా దూరమవుతాయి.
  • బఠాణీలు: వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఎంతో శక్తి అందుతుంది. ఈ మొలకల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం వరకూ ఆకలి దరిచేరదు. కొన్ని తీసుకుంటేనే పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడు కొవ్వు నిల్వలు తగ్గిపోతాయి. అంతేకాదు బఠాణీ మొలకల్లో కొవ్వులూ, కెలొరీలూ చాలా తక్కువ. బరువు తగ్గాలనుకున్నవాళ్లు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. వీటిలోని పోషకాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
  • సెనగలు: ఈ మొలకల్లో మేలురకం కార్బోహైడ్రేట్లు ఎక్కువ. విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి సెనగ మొలకలు చక్కని ఆహారం. ఈ మొలకల్లో కొలెస్ట్రాల్‌ ఉండదు. చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రకరకాల అలర్జీలతో బాధపడేవారు వీటిని తింటే ఉపశమనం పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకుంటే చక్కెర అదుపులో ఉంటుంది. సలాడ్‌, చాట్‌, సూప్‌.. ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
పచ్చిగా తినలేకపోతే ఈ విధంగా తయారుచేసుకుని రుచిగా తినండి
మొలకలు వచ్చిన గింజలను అలాగే తినవచ్చు. లేదంటే ఇతర ఆహార పదార్థాల్లో కలుపుకుని తినవచ్చు. మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, టమాట, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి చిటికెడు ఉప్పు కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఉడికించకుండా, వేయించకుండా తినడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు పూర్తిస్థాయిలో శరీరానికి అందుతాయి. మొలకెత్తిన గింజల్లో తాలింపు పెట్టిన బీట్‌ రూట్ సన్నని ముక్కలు, క్యాబేజీ, కీర, ముల్లంగి, క్యారెట్ లాంటి కూరగాయల తురుములను కలుపుకుని బ్రేక్‌ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. పెసలు, శనగలు, జొన్నలు, గోధుమలు, వేరుశనగలు, బఠాణీలు, సోయాబీన్స్, చిక్కుడు లాంటి మొలకలు తీసుకోవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)