ఎటువంటి మోకాళ్ళ నొప్పినైనా తగ్గించి ఎముకలను బలంగా తయారుచేసే అద్భుతమైన 3 పద్ధతులు

Loading...
30 శాతం మహిళలు, 25 శాతం మగవాళ్లు.. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. చాలా బాధాకరమైన, నొప్పితో కూడిన మోకాళ్ల నొప్పులకు అనేక కారణాలున్నాయి. ఆర్ఏ, గౌట్, ఆస్టియోఆర్థరైటిస్, స్ప్రెయిన్ వంటి కారణాల వల్ల మోకాళ్ల నొప్పి వస్తుంది. జాయింట్ పెయిన్ కూడా.. డయాబెటిస్ వల్ల వస్తుంది. మోకాళ్ల నొప్పి వాపు, ఎర్రకందినట్టు కనిపిస్తుంది. ఆయుర్వేద మెడిసిన్స్.. మోకాళ్ల నొప్పిని చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. అంతేకాదు.. ఈ ఆయుర్వేద రెమిడీస్.. అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ మూళికలు.. బలాన్ని, పోషణను శరీరానికి అందిస్తాయి. మోకాళ్ల నొప్పిని తగ్గించడమే కాకుండా.. ఎముకలను బలంగా మారుస్తాయి. మరి మోకాళ్ల నొప్పులు నివారించే ఎఫెక్టివ్ ఆయుర్వేద రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
  • పసుపు అద్భుతమైన ఆయుర్వేద మూళిక. అనేక రకాల సమస్యలు నివారించడంలో ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్యుమిన్.. పెయిన్ కిల్లర్స్ కంటే.. ఎఫెక్టివ్ గా మోకాళ్ల నొప్పిని నివారిస్తుంది. టేబుల్ స్పూన్ పసుపుని ఒక గ్లాసు పాలల్లో కలుపుకుని ప్రతి రోజు తాగుతూ ఉండటం వల్ల.. మోకాళ్ల నొప్పి తగ్గుతుంది.
  • యాపిల్ సైడర్ వెనిగర్ లో అల్కలైజింగ్ గుణాలుంటాయి. ఇవి.. మోకాళ్ల నొప్పిని తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కీళ్ల నొప్పులు రాకుండా చేస్తాయి. ఒక భాగం యాపిల్ సైడర్ వెనిగర్, ఒక భాగం ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకుని.. మసాజ్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే.. నొప్పి తగ్గుతుంది.
  • ఉసిరికాయలో మోకాళ్ల నొప్పులు నివారించడంలో.. అద్భుతమైన రెమిడీ. ఇది హానికారక ఫ్రీ రాడికల్స్ శరీరం నుంచి తొలగిస్తుంది. నొప్పి తగ్గించడంతో పాటు.. బలాన్ని అందిస్తుంది. ఒక గ్లాసు ఉసిరికాయ జ్యూస్ ని ప్రతి రోజూ తాగడం వల్ల మోకాళ్ల నొప్పి తగ్గడమే కాదు.. మంచి ఆరోగ్యం కూడా పొందుతారు. ఒకవేళ జ్యూస్ అందుబాటులో లేకపోతే.. ఉసిరికాయలు తింటే సరిపోతుంది.
Loading...

Popular Posts