రోజూ బాగా మగ్గిన రెండు అరటి పండ్లను తింటే.. మీ శరీరానికి కలిగే 13 అద్బుత ప్రయోజనాలు

ఈ భూమ్మీద దొరికే పండ్లలో ఆరోగ్యకరమైన పండు అరటి పండు అన్న విషయం మీకు తెలుసా..? ఇందులో ఏ పండులో లేనంత ఎక్కువగా పొటాసియం ఉంటుంది. బాగా మగ్గిన రెండు అరటి పండ్లను రోజూ తింటే విపరీతమైన మోతాదులో యాంటి ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. పండు ఎంత బాగా పండితే పోషకాలు అంత ఎక్కువగా లభిస్తాయి. అరటిపండు తింటే కలిగే ప్రయోజనాలను కింద మీకు వివరించాం.
 • మానసిక ఒత్తిడి ఉన్న వ్యక్తులకు మెదడులో సేరాటోనిన్ మోతాదు తక్కువగా ఉంటుంది. అరటిపళ్ళు తింటే సేరాటోనిన్ మోతాదు పెరిగి ఒత్తిడిని తగ్గిస్తుంది.
 • అరటిపల్లలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ అనే మూడురకాల సహజసిద్దమైన చక్కేర తో పాటు పీచుపదార్డం కూడా ఎక్కువగానే ఉంటుంది. రెండు అరటిపళ్ళు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసే శక్తి వస్తుంది.
 • అరటి పండ్లను తినడం వలన అధికబరువు తగ్గించుకోవచ్చు. అరటి పండ్లను తినడం వలన శరీరంలో క్యాలరీలను తగ్గించుకోవచ్చు.
 • అరటి పళ్ళు శక్తిని నెమ్మదిగా విడుదల చేయడం వలన బ్రెయిన్ ఎక్కువ సమయం అలర్ట్ గా ఉంటుంది. పొటాసియం మోతాదు ఎక్కువగా ఉండడం వలన బ్రెయిన్ అలర్ట్ గాను, మెగ్నీషియం లెవెల్స్ వలన మరింత ఏకాగ్రతతో ఉంటుంది.
 • పొటాసియం మోతాదు, బి 6 విటమిన్ అధికంగా ఉండడం మూలాన హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
 • కడుపులో ఎసిడిటి తగ్గించి, పీచు ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. దీనివలన గుండెలో మంట గాని గుండెపోటు గాని రాకుండా చేస్తుంది.
 • రోజుకు రెండు అరటి పళ్ళను తింటే రక్తపోటు 10 శాతం తగ్గుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రక్తపోటు ఉన్నవారు అరటి పళ్ళను తీసుకోవడం వలన తక్కువ సోడియం అధిక పొటాసియం కలిగి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.
 • అరటి పళ్ళలో ఐరన్ శాతం ఎక్కువ గా ఉండడం వలన రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అనేమియా రాకుండా కాపాడుతుంది. బి 6 విటమిన్ ఎక్కువగా ఉండడం వలన అధిక తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.
 • అరటిపండులో ఉండే పోషకాల వలన ఎముకలు కాల్షియం చేర్చుకొని గట్టిపరుస్తుంది.
 • అరటి పండులో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వలన గుండె జబ్బులు, డయాబెటిస్ కేన్సర్ రాకుండా చేయడమే కాకుండా, కండరాలలో ఉండే కణజాలాలను తగ్గకుండా కాపాడుతుంది.
 • అరటి పండులో పొటాసియం, మెగ్నీషియం, విటమిన్ బి 6 అధికంగా ఉండడం వలన నికోటిన్ శాతాన్ని తగ్గించి పొగతాగే అలవాటును మాన్పిస్తుంది.
 • వైద్యుల పరిశోధనలో కడుపులోని అల్సర్లను అరటిపండు తగ్గిస్తుందని తేలింది. ఇంగ్లాండ్ కు చెందిన వైద్యులు ఇదే విషయాన్ని ధృవీకరించి హీల్స్ ను అల్సర్లను తగ్గిస్తుందని తేల్చి చెప్పారు.
 • అరటిపండులో పీచు పదార్దం ఎక్కువగా ఉండడం మూలాన మలబద్దకాన్ని పూర్తిగా నివారించగలుగుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)