రోజూ ఓ గ్లాసు క్యారట్ జ్యూస్ తాగండి.. క్యారట్ లో విటమిన్ A, విటమిన్ C, ఫైబర్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి

క్యారట్ ఈ భూమికి ఒక అద్భుతమైన వరం. ఫైటో కెమికల్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ .. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే క్యారట్ అద్భుతాల నిధి. ఇలాంటి క్యారట్ మార్కెట్లో దొరికినా పట్టంచుకోవట్లేదు చాలామంది. రోజుకో గ్లాసు క్యారట్ జ్యూస్ తాగండి. ఎందుకు తాగాలో చదివి తెలుసుకోండి.
  • ఆడవారు క్యారట్ జ్యూస్ తాగడం తప్పకుండా అలవాటు చేసుకోవాలి. దీని వలన ప్లాస్మా కెరొటినాయిడ్‌లు మెరుగుపడతాయి. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలావరకూ తగ్గుతుంది.
  • క్యారట్ లో విటిమిన్ ఏ పుష్కలంగా దొరుకుతుంది. ఇందులో బిటా కెరోటిన్ కుడా లభిస్తుంది. ఇవి కంటికి చాలా ఉపయోగకరం. కనులని ఆరోగ్యంగా ఉంచి, కంటి చూపుని మెరుగుపరుస్తాయి.
  • క్యారట్ ముఖసౌందర్యానికి కూడా మంచిది. ఇందులో దొరికే యాంటిఆక్సిడెంట్స్, పొటాషియం కొత్త కణాలు పుట్టుకురావడానికి సహాయపడతాయి. మృతకణాలు పోయి, చర్మం అందంగా తయారవుతుంది.
  • క్యారట్ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది సిస్టోలిక్ ప్రెజర్ ని తగ్గిస్తుంది.
  • డయాబెటిస్ ని అడ్డుకునేందుకు కూడా క్యారట్ ఉపయోగపడుతుంది. ఇందులో దొరికే మినరల్స్ శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది క్యారట్.
  • రోజూ ఓ గ్లాసు క్యారట్ జ్యూస్ తాగండి. రోగనిరోధక శక్తికి ఇది మేలు చేస్తుందో మీరే తెలుసుకుంటారు.
  • క్యారట్ లో ఐరన్, విటమిన్ సి దొరుకుతాయి. శాకాహారుల్లో ఉండే అనీమియా లోపం క్యారట్ ద్వారా కవర్ చేయవచ్చు.
  • క్యారట్ లో పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 కూడా లభిస్తాయి. బలమైన నరాల వ్యవస్థకు, బలమైన ఎముకలు, చురుకైన మెదడు పొందడానికి క్యారట్ గొప్ప సాధనం. 
  • ఇంతే కాదు. క్యారట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అర్థరైటిస్ వంటి డిజార్డర్ తో పోరాడుతుంది. మలబద్ధకం, శ్వాస సంబంధిత సమస్యలు, ఎసిడిటి వంటి చిక్కులను దూరం చేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)