శరీరానికి సరిపడా నిద్ర లేకపోతే ఈ వ్యాధి వస్తుంది

Loading...
మనిషి శరీరానికి నిద్ర అత్యవసరం. రోజంతా పనిచేసి అలిసిపోయిన శరీరానికి విశ్రాంతినివ్వడమే నిద్ర. అయితే నిద్ర అనేది అవసరానికి తగ్గకూడదు, అలాగే అవసరానికి మించి ఉండకూడదు. నిద్రలేమితో పాటు అతినిద్ర కూడా సమస్యే. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినోలజి కథనం ప్రకారం మగవారిలో అతినిద్రతో పాటు నిద్రలేమి వలన డయాబెటిస్ వస్తుందట.

30-60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న 780 మంది మగవారిపై జరిగిన ఒక ఆధ్యనంలో ఈ విషయం బయటపడింది. సగటున 7-8 గంటల నిద్రపోతున్న మగవారి కంటే తక్కువ సమయం నిద్రపోతున్న మగవారిలో లేదా ఎక్కువ సమయం నిద్రపోతున్న మగవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ గణనీయంగా పెరగటం గమనించారు పరిశోధకులు.

" మగవారు ఎక్కువగా నిద్రపోయినా, తక్కువ సమయం నిద్రపోయినా బాడి సెల్స్ ఇన్సులీన్ కి తక్కువగా రెస్పాండ్ అవడం జరుగుతోంది. దీని వలన డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా పెరిగిపోతుంది. మనిషి ఆరోగ్యంగా ఉన్నా, అతినిద్ర లేదా నిద్రలేమి మంచిది కాదు" అంటూ ఫెమ్కే రట్టర్స్ అనే పరిశోధకుడు వాఖ్యానించారు.
కాబట్టి శరీరానికి నిద్ర కూడా సరిపోయేంత వరకు మాత్రమే ఇవ్వాలి లేదా సరిపోయేదాకా ఇవ్వాలి. అతినిద్ర, నిద్రలేమి .. రెండూ ప్రమాదకరమే.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...