టీ, కాఫీ బదులు ఇది తాగండి చక్కటి ఆరోగ్యం మీ సొంతం

గ్రీన్ టీని అన్ ఆక్సడైజ్డ్ లీఫ్స్ తో తయారు చేస్తారు. దీంట్లో శరీరానికి పనికివచ్చే యాంటిఆక్సిడెంట్స్, పోలిఫేనాల్స్ ఉంటాయి.
  • గ్రీన్ టీ చర్మానికి చాలా మంచిది. రకరకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశాల్ని తగ్గిస్తూనే, ముఖాన్ని అందంగా తయారు చేస్తుంది గ్రీన్ టీ.
  • గ్రీన్ టీకి డెమెన్టియా అనే జబ్బుని నయం చేసే శక్తి ఉందని పరిశోధనల్లో తేలింది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడుని చురుగ్గా ఉంచుతుంది.
  • గ్రీన్ టీలో ఉండే పొలిఫెనల్స్ క్యాన్సర్ మీద పనిచేస్తుంది. ముందునుంచి అలవాటు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని కూడా తగ్గిస్తుంది.
  • అల్ట్రావయొలెట్‌ UVB రేస్ నుంచి సంరక్షించే శక్తి గ్రీన్ టీ సొంతం.
  • మామూలు టీకి బదులు గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ అని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
  • గ్రీన్ టీ వలన బరువు ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పడానికి సాక్ష్యాలు లేకపోయినా బరువు తగ్గాలనుకునే వారికి తనవంతు సాయం చేస్తుంది గ్రీన్ టీ. లావుగా ఉండేవారు గ్రీన్ టీ తాగడం అలవాటుగా మార్చుకోవాలి.

Popular Posts

Latest Posts