ఈ ఏడు ఆహారాలను ప్రతి రోజూ తీసుకుంటే బరువు తగ్గడాన్ని ఎవరూ ఆపలేరు.. ఖచ్చితంగా వీటిని మీ డైలీ డైట్ లో చేర్చుకుని.. క్రమం తప్పకుండా తిని చూడండి

  • ఈ ఏడు ఆహారాలను ప్రతి రోజూ కంపల్సరీ తీసుకోవడం వల్ల.. మీరు అనుకున్న బరువు తగ్గడాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి.. ఖచ్చితంగా వీటిని మీ డైలీ డైట్ లో చేర్చుకుని.. క్రమం తప్పకుండా తిని చూడండి. ఇవి హెల్తీ ఫుడ్స్ కావడం, ఫ్యాట్ కరించే సత్తా కలిగి ఉండటం, పోషకాలు అందించే ఆహారాలు కావడం వల్ల వీటిని మీకు సూచిస్తున్నాం. 
  • ఓట్స్ ఓట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఇవి బ్లడ్ షుగర్ ని పెరగకుండా చేస్తాయి. అలాగే ఎక్కువ సమయం ఆకలి కాకుండా చూస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.
  • దోసకాయ దోసకాయల్లో ఎక్కువ శాతం నీళ్లు ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి పొట్టలో ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వీటిని ఖచ్చితంగా చేర్చుకోవాలి.
  • ఎగ్స్ ఎవరైతే.. ప్రతి రోజూ ఉదయం కోడిగుడ్డు తింటారో వాళ్లు.. రెండు రెట్లు వేగంగా, ఎక్కువగా బరువు తగ్గుతారు.
  • ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ లో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది పొట్టలో చేరుకున్న ఫ్యాట్ ని కరిగిస్తుంది. రోజుకి ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ చాలా ఆరోగ్యకరం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
  • అరటిపండు అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తుంది. పొటాషియం శరీరంలో సాల్ట్, వాటర్ లెవెల్ ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా అరటిపండు తినండి.
  • సోంపు సోంపులో ఫైబర్, మాంగనీస్, క్యాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ భోజనం తర్వాత ఒక స్పూన్ సోంపు గింజలు తీసుకుంటే.. అద్భుతంగా బరువు తగ్గేస్తారు. కావాలంటే.. ప్రయత్నించి చూడండి.
  • పెరుగు పెరుగులో ఉండే క్యాల్షియం కొలెస్ట్రాల్ హార్మోన్ ని తగ్గిస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరంలో గ్యాస్, బ్లోటింగ్ సమస్యను నివారిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)