శరీర బరువుని తగ్గించే అద్భుతమైన మిరియాల టీ.. తయారు చేసే విధానం

Loading...
ఆరోగ్యకరమైన జీవితం జీవించాలంటే బరువు తక్కువగా ఉండాలి. ఆరోగ్యకరమైన పద్ధతిలో శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటే మిరియాలతో చేసిన టీ తాగడండి. 
మిరియాల టీ తయారీకి కావలసిన పదార్ధాలు:-
  • మిరియాలు ఒక స్పూన్ 
  • 2 కప్పుల నీళ్లు 
  • నిమ్మ రసం ఒక స్పూన్ 
  • తేనె ఒక స్పూన్ 
  • అల్లం తురుము ఒక స్పూన్ 
తయారు చేసే విధానం:-
2 కప్పుల నీళ్ళల్లో మిరియాలు అల్లం తురుము వేసి బాగా మరిగించాలి. మరిగించిన ఆ నీళ్ళని వడపోసి దానిలో నిమ్మ రసం తేనె కలుపుకోవాలి. అంతే మిరియాలు టీ రెడీ !!!
  • ఆకలిని తగ్గిస్తుంది: స్వీట్లు, అధిక క్యాలరీలు ఉన్న ఆహారం తింటున్నారా! అయితే, వీటికి బదులుగా మిరియాల టీ తాగండి. ఘాటైన వాసన కలిగి ఉండే మిరియాల టీ ఆకలిని తగ్గిస్తుంది. 
  • జీర్ణ శక్తిని పెంచుతుంది: మిరియాలతో చేసిన టీ, కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. 
  • గుండె ఆరోగ్యానికి మంచిది: చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన టీలో కూడా ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
  • విశ్రాంతి నిస్తుంది: ప్రతి రోజు పెరిగే ఒత్తిడి వలన శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ఒత్తిడిని మిరియాల టీ తాగటం ద్వారా తగ్గించుకోవచ్చు 
  • విటమిన్‌ 'సి' ఉంటుంది: మిరియాలతో చేసిన టీ లో విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్‌ వైరస్‌, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీర్ణక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ మరియు జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వను నివారించి బరువును తగ్గిస్తాయి.
Loading...

Popular Posts