మైదా పిండితో మన ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది. మైదా పిండి మన శరీరాన్ని ఎంత ఘోరంగా పాడుచేస్తుందో చూడండి

మైదా పిండితో చేసే చాలా వంటకాలు బయట తింటుంటారు . కానీ దాని వల్ల వచ్చే నష్టాలేంటో ఆలోచించారా ? పీచు పదార్థాలు కనబడవు మైదా పిండిలో. అలాంటిది శరీరం దాన్ని ఎలా జీర్ణించుకోవాలి ? జీర్ణక్రియ సరిగా జరగక మొలల వ్యాధితో పాటు పేగుల్లో పుండు లాంటివి కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కేవలం పిండిపదార్థాలే దొరికే మైదా పిండి వలన ఊబకాయం వస్తుంది. మైదాలో ఉండే ప్రొటీన్ల శాతం కూడా చాలా తక్కువే. అలాగే మైదాలో glycaemic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంటో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. మైదా ఎక్కువగా శరీరంలో చేరినా కొద్దీ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇలా మెల్లిమెల్లిగా మధుమేహం బారిన పడుతుంది శరీరం.

ఇక్కడ మీకు తెలియాల్సిన మరో విషయం ఏమిటంటే, మైదాలో benzoic peroxide మరియు alloxan అనే రసాయనాల్ని వాడుతున్నారు. వీటివల్ల మైదాకు తెలుపు రంగు వస్తోంది. ఇప్పుడు బేకరీలో, హోటళ్లలో దొరికే చాలావరకు తిండి పదార్థాల్లో మైదా పిండినే వాడుతున్నారు. మన ఆరోగ్యంతో వ్యాపారులకు పనిలేదు కదా. అలాగే మనమే ప్రోత్సహించకపోతే వారి కడుపుకి తిండి కూడా లేదు. కాబట్టి ఇకనుంచి బయటి వస్తువులు తినేముందు బాగా ఆలోచించండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)