బంగాళాదుంప, కోడి గుడ్డు, కాఫీగింజ ఈ మూడు మనుషుల గురించి, కష్టాల్లో వారి ప్రవర్తనా తీరును గురించి అద్భుతంగా వివరిస్తాయి

Loading...
బంగాళాదుంప, కోడి గుడ్డు, కాఫీగింజ…..ఈ మూడు వస్తువులు, మనుషుల నైజాన్నిగురించి, కష్టాల్లో వారి ప్రవర్తనా తీరును గురించి చక్కగా చెబుతాయ్… సో ఈ మూడు వస్తువుల్లో మీరే టైపో ఇది చదివాక నిర్థారించుకోండి.

ఇది… ఓ ఆలుగడ ,కోడిగుడ్డు, కాఫీగింజ కథ.
అనగనగా ఓ తాత….అతని దగ్గర ఓ మాయ కుండ ఉంది. అందులో నీళ్లను పోయగానే… వెంటనే మరుగిపోతుంటాయ్.! ఒక రోజు ముగ్గురు వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చారు.
మొదటి వ్యక్తి తన చేతిలో ఓ ఆలుగడ్డను తీసుకొచ్చి…. ఇది తినడానికి కష్టంగా ఉంది అన్నాడు.
రెండవ వ్యక్తి తన చేతిలోని కోడిగుడ్డును చూపించి.. ఇది తినడానికి చాలా ఈజీ అన్నాడు.
ఇంతలో మూడవ వ్యక్తి తన చేతిలోని కాఫీ గింజలను చూపించి… ఇవి తినడానికి సరిపోవు అన్నాడు.

అప్పుడు ఆ తాత మీ ముగ్గురు తీసుకొచ్చిన పదార్థాలను ఈ మరుగుతున్న నీటిలో పడేయండి అంటాడు… వారు అలాగే చేస్తారు.

గట్టిగా తుంచడానికి రాని ఆలుగడ్డ.. ఆ మరుగుతున్న నీటిలో ఉడికిన తర్వాత మెత్తగా దూదిపింజలా మారిపోయింది.
పచ్చిగా ఉన్నప్పుడు… గట్టిగా ఒత్తితే పగిలే కోడిగుడ్డు…ఆ మరుగుతున్న నీటిలో ఉడికిన తర్వాత గట్టిగా తయారయ్యింది.
ఇక కాఫీ గింజలైతే… ఆ మరుగుతున్న నీటిలో తమ ఆకృతిని పూర్తిగా మార్చుకొని కాఫీగా మారిపోయాయ్.

ఇప్పుడు ఇవన్నీ… మన జీవితాన్ని చాలా క్లియర్ గా చూపిస్తాయ్ ఓ సారి చూడండి:
కుండ మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.
కుండలో మరుగుతున్న నీళ్లు మన కష్టాలను సూచిస్తాయి.. ప్రతి మనిషి జీవితంలో ఎప్పడో ఓ సారి కష్టాలు ఎదురవుతాయి.

ఆలుగడ్డ, కోడిగుడ్డు, కాఫీ గింజలు.. మనుషుల లోని రకాలు. వాటిలాగే మనుషులు తమతమ కష్టాలకు ఒక్కోరకంగా ప్రతిస్పందిస్తుంటారు.
ఉడకని బంగాళదుంపలాగా గట్టిగా ఉన్న మనుషులు…కష్టాలు రాగానే వేడి నీటిలో మరిగిన ఆలుగడ్డలాలా మొత్తబడిపోతారు.
కొంతమందైతే కష్టాలు వచ్చాకే… ఉడికిన కోడి గుడ్డు లాగా గట్టిపడతారు.. ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటారు.
కొంత మందైతే పరిస్థితులకు తగ్గట్టు తమను తాము మార్చుకుంటారు.. ఎలాగైతే కాఫీ గింజలు నీళ్లలో కలిసిపోయాయో అలా..!

ఇప్పుడు చెప్పండి ఇందులో మీరు బంగళాదుంపలా? కోడిగుడ్డా? లేక కాఫీ గింజలా….?


Loading...

Popular Posts