మన దేశంలో మనకు ప్రవేశంలేని ప్రదేశాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా ? అవును మీరు విన్నది నిజమే ఈ ప్రదేశాల గురించి తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు

Loading...
భారతదేశంలో భారతీయులకు ప్రవేశంలేని ప్రదేశాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా ? ఈ ప్రదేశాల గురించి తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. మన దేశంలో మనకు ఎంట్రీ లేని ప్రదేశాలు కుడా ఉంటాయా అనుకుంటున్నారా ? అవును మీరు విన్నది నిజమే ఆ ప్రదేశాలలో మనకు ఎంట్రీ లేదట. అసలు ఆ ప్రదేశాలు ఏమిటో ? వాటి వెనుకనున్న కారాణాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా ?
  • హిమాచల్ ప్రదేశ్ లోని ఫ్రీ కసోల్ కేఫ్ / రెస్టారెంట్ ఒక్కసారిగా వెలుగులోకి రావడానికి గల కారణం ఆ కేఫ్ ఓనర్ భారతీయులను కేఫ్ లోపలి అనుమతించకపోవడమే. ఆ కేఫ్ వారు వినియోగదారులు జాతీయతను బట్టి వివక్ష చూపుతారు.
  • తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఉన్న నవాబ్ లు ఇంటిని ఒక హోటల్ గా మార్చారు. ఈ హోటల్ లో విదేశి పాస్ పోర్ట్ కలిగిన వారిని మాత్రమే ఆ హోటల్లో ఉండేందుకు అనుమతిస్తారు. భారతీయులకు ఆ హోటల్లో ప్రవేశం లేదని ఒక బోర్డు కుడా కనిపిస్తుంది.
  • నిప్పాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు జపాన్ కు చెందిన ప్రజల కోసం బెంగళూరులో 2012 వ సంవత్సరంలో ఒక హోటల్ ను నిర్మించారు. ఈ రెస్టారెంట్లోకి జపనీయులకు తప్పా వేరే వాళ్లకి ప్రవేశం లేదు. 2012 లో ప్రారంభమైన ఈ హోటల్ ఆ తరువాత రెండేళ్ళకే మూతపడింది.
  • అరేబియా సముద్రంని ఆనుకుని ఉన్న గోవా లో అద్భుతమైన ప్రదేశాలను, సుందరమైన బీచ్ లను అన్నింటిని మనం చూడచ్చు కానీ, కొన్ని ప్రైవేటు బీచ్ లలో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతిస్తారు. భారతీయులను ఆ బీచ్ లోకి అనుమతించకపోవడానికి ప్రధాన కారణం విదేశీయుల పట్ల భారతీయులు అసభ్యంగా ప్రవర్తించడమే అని ఆ ప్రైవేటు బీచ్ ఓనర్లు చెబుతారు.
  • పాండిచేర్రి లో అనేక సుందరమైన ప్రదేశాలున్నాయి, విదేశియులకు పాండిచేర్రి ఒక టూరిస్ట్ స్పాట్ కుడా, కానీ గోవాలో లాగానే పాండిచేర్రి లో కుడా కొన్ని బీచ్ ల్లోకి భారతీయులకు అనుమతి లేదు.
Loading...

Popular Posts