జుట్టు ఊడిపోతుందా ? అయితే ఉల్లిపాయ రసంతో ఒత్తైన జుట్టు పొందండి. ఉల్లిపాయ రసాన్ని ఈ విధంగా వాడితే చక్కని శిరోజాలు సొంతమవుతాయి

Loading...
ప్రస్తుత కాలంలో అందంగా ఉండడం కోసం, అందంగా కనిపించడం కోసం చాలామంది వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ విషయంలో స్త్రీ, పురుష బేధం లేదు. అయితే అందం విషయానికి వస్తే ముఖంతోపాటు ప్రధానంగా చెప్పుకోదగినవి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా ఇట్టే ఆకర్షింపబడతారు. ఈ క్రమంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుందని అంటున్నారు. ఈ చిట్కాలను కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవచ్చు. దీంతో చక్కని శిరోజాలు వారి సొంతమవుతాయి. 

ఉల్లిపాయ రసంతో వెంట్రుకలకు పోషణ:- 
  • ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ అనే మూలకం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే కొన్ని ఉల్లిపాయలను తీసుకుని వాటిని మెత్తని పేస్ట్ లా చేయాలి. ఆ పేస్ట్ ని తల కుదుళ్లకు తగిలేలా రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే తలపై ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ పెరుగుతాయి. అంతేకాదు వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా ఉంటాయి.
  • ఉల్లిపాయలను బాగా దంచి ఆ మిశ్రమంలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఇతర ఏవైనా ఆయిల్స్ ను కలిపి రాసుకోవాలి. దీంతో శిరోజాలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢమై వెంట్రుకలు బలంగా, కాంతివంతంగా ఉంటాయి.
  • ఉల్లిపాయలను మెత్తగా దంచి వాటి నుంచి తీసిన రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. అనంతరం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. రెగ్యులర్ గా ఈ టిప్ ను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు. శిరోజాలు కూడా కాంతివంతమవుతాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...